Reading Time: < 1 min

Court Trailer Review
కోర్టు ట్రైలర్ రివ్యూ

న్యాయవ్యస్థలో బలమైన ఫోక్సో కేసును దుర్వినియోగపరిస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ తో అల్లుకున్న కథే కోర్టు సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మైనర్ బాలికను ప్రేమించిన కుర్రాడిపై బాలిక తండ్రి ఆర్ధిక, రాజకియ బలంతో ఫోక్సో చట్టం కింద కేసుపెట్టడం, ఆ కుర్రాడు మధ్యతరగతి కుటుంబం వాడు కావడంతో ఆ కేసును ఎలా ఎదుర్కోవాలో తెలియదు. దీంతో లాయర్ గా నటిస్తున్న ప్రియదర్శి ఆ కుర్రాడిని నిర్ధోషిగా ఎలా బయటకు తీసుకొస్తాడు. ఆ క్రమంలో ప్రియదర్శి ఎదుర్కొనే సవాళ్లు ఏంటి అనేది సినిమాలో కోర్ పాయింట్ అని తెలుస్తుంది. ముఖ్యంగా బలమైన ఎమోషన్స్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఇలాంటి సబ్జెక్టులు ఆర్థికంగా పెద్దగా నిలబడవు అనేది పరిశ్రమలో మాట్లాడుకుంటారు. ఇలాంటి లెక్కలు ఉన్నప్పటికీ ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించడంపై ప్రశంసలు వస్తున్నాయి. వాల్ పోస్టర్ బ్యానర్ నాని ప్రజెంట్ చేస్తుండగా.. రమ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 14న విడుదల అవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 

Movie Title : Court – State vs A Nobody
Banner: Wall Poster Cinema
Release Date : 14-03-2025
Censor Rating : “UA13+”
Cast : Priyadarshi, Sivaji, Sai Kumar, Rohini, Harshavardhan, Harsh Roshan, Sri Devi
Writer & Director : Ram Jagadeesh
Music : Vijai Bulganin
Cinematography : Dinesh Purushothaman
Editor: Karthika Srinivas R
Produced by : Prashanti Tipirneni
Runtime : 150 minutes