Daaku Maharaj Trailer Review
డాకు మహారాజ్ ట్రైలర్ రివ్యూ
నందమూరి బాలయ్య నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. బాబి కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్మెంట్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డాకు మహారాజ్ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ లో అనగనగా ఒక రాజు ఉండే వాడు అనే చిన్న పిల్ల వాయిస్ ఓవర్ తో మొదలు అవుతుంది. ఆ డైలాగ్ చెప్పెటప్పుడు ఒక తల లేని విగ్రహం ఉంటుంది. ఆ తరువాత డాకు మహారాజ్ ను పరిచయం చేశారు. గుర్రాలు, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఆ తరువాత అడవిని పరిరక్షించే ఆఫీసర్ గా సీతారామ్ ను చూపించారు. ఆ తరువాత నానాజీ అనే మరో క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఇంతకీ ఈ ముగ్గురు క్యారెక్టర్లకు ఏంటి సంబంధం అనే పాయింట్ ఆసక్తని రేకెత్తిస్తోంది.
ఈ ట్రైలర్ లో బాబీ డియోల్ పాత్ర చాలా వైలెంట్ గా కనిపిస్తుంది. అక్కడ జరిగే మైనింగ్ ఏరియాలో కూలీల శ్రమదోపిడి కనిపిస్తుంది. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి అనే డైలాగ్ తో అక్కడి ప్రజల అణిచివేత కనిపిస్తుంది. అలాంటి అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటిని కాపాడే వాడు కింగ్ ఆఫ్ జంగిల్ అనే డైలాగ్ తో బాలకృష్ణకు మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఇక సినిమాలో శ్రద్ద శ్రీనాథ్, ప్రజ్ఞ్య జైశ్వాల్, ఊర్వశి రౌటేలా వంటి గ్లామరస్ హీరోయిన్స్ నటించారు. కచ్చితంగా ట్రయిలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది.
Movie Title: Daaku Maharaaj
Release Date: January 12, 2025
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios
Cast & Crew :
Hero: Nandamuri Balakrishna
Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandini Chowdary, Urvashi Rautela
Director: Bobby Kolli
Producers: Naga Vamsi S, Sai Soujanya
Music Director: Thaman S
Cinematography: Vijay Kartik Kannan
Editor: Niranjan Devaramane, Ruben
Production Designer: Avinash Kolla