Reading Time: < 1 min

Daaku Maharaj Movie Dabidi Dibidi Song Review
డాకు మహారాజ్ నుంచి వచ్చిన దబిడి దిబిడి సాంగ్ ఎలా ఉందంటే

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ చిత్రం నుంచి దబిడి దిబిడి అనే పాట తాజాగా విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చున్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతున్న ఈ చిత్రంపై అభిమానులకు పెద్ద సంఖ్యంలో అంచనాలు ఉన్నాయి. పిరియాడికల్, పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా మూడవ పాట విడుదలైంది. మరీ ఈ పాట ఎలా ఉందో చూద్దాం.

ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటలో బాలయ్య బాబు గత సినిమాల డైలాగులను ఎక్కువగా వాడారు. పాట టైటిల్ కూడా ఆయన పాపులర్ డైలాగ్ అయినా దబిడి దిబిడే. ఇక పాటలో కూడా కత్తుల తోటే కాదు కంటి చూపుతోటే చంపాలా, కిస్సుల ఆటకు వస్తే ప్లేస్, టైమ్ నువ్వే చెప్పాలా… ఇంటికే వస్తావో, నట్టింటికే వస్తావో నువు అడుగెడితే హిస్టరీ రిపీట్సే అంటూ దబిడి దబిడి దబిడి దబిడి నీ చేయ్యే ఎత్తు బాలా… నా చెంప మోగి పోయేలా అంటూ సాగుతుంది. ఇక చరణంలో కూడా ఇదే ప్రయోగాన్ని చేశారు రైటర్. ఫ్లూట్ జింక ముందు ఊదకు అనే మాటలను కూడా పాటలా మలిచిన తీరు మెప్పించింది. తమన్ అందించిన మ్యూజిక్ బాగుంది అలాగే సింగర్ వాగ్దేవి కూడా తన గొంతుతో మాయ చేసింది. మొత్తానికి పాట అభిమానులకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు.

Song Name : Dabidi Dibidi
Singers : Thaman S & Vagdevi
Lyrics – Kasarla Shyam
Additional African Percussions – Anandan Sivamani
Written and Directed by Bobby Kolli
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios
Producers: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Music: Thaman S
DOP: Vijay Kartik Kannan
Production Designer: Avinash Kolla
Editors: Niranjan Devaramane, Ruben
Screenplay: K Chakravarthy Reddy
VFX Supervisor: Yugandhar T
Stunts: V Venkat
Dialogues: Bhanu-Nandu
Additional Screenplay: Hari Mohana Krishna, Vineeth Potluri