David Warner Look From Rabinhood
రాబిన్ హుడ్ నుంచి డేవిడ్ వార్నర్ లుక్
నితిన్, శ్రీలీల నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర ప్రచారం మొదలు పెట్టి మూవీ టీమ్ తాజాగా డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రాబిన్ హుడ్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికేటర్ డేవిడ్ వార్నర్ నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన లుక్ ను విడుదల చేయడంతో క్రికెట్ అభిమానులు సంతోషపడుతున్నారు. ఫ్రమ్ బౌండ్రీ టు బాక్సాఫీస్ అంటూ వార్నర్ లుక్ ను విడుదల చేశారు. అయితే మూవీ ప్రమోషన్స్ లలో కూడా ఆయన పాల్గొంటారు అని డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పారు.
రాబిన్ హుడ్ చిత్రానికి సంబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి మొదలైంది. పుష్ప సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ మ్యానరిజమ్ చేసిన డేవిడ్ వార్నర్ ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల పాటలకు, డైలాగ్స్ కు యాక్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటి విపరీతంగా ఆదరణ వచ్చింది. ఇప్పుడు నేరుగా బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నందుకు ఆయన ఫ్యాన్స్ ఉత్సహంగా ఉన్నారు.