Reading Time: 2 mins

Demont Colony 2 Movie Review – Tel

డిమోంటి కాలనీ 2 సినిమా రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

సామ్ (సర్జానో ఖలీద్) ఆత్మహత్య చేసుకొంటే అతని లవర్ డెబ్బీ (ప్రియా భవానీ శంకర్) సామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాడో తెలుసుకోవాలనుకొంటుంది. దానికోసం దావోషి (త్సెరింగ్ దోర్జీ) సహాయంతో సామ్ ఆత్మని కలిసి కొన్ని నిజాలు తెలుసుకొంటుంది. కవలలు అయినా శ్రీని మరియు రఘునందన్ (అరుళ్ నిటి) కి ప్రమాదం ఉందని మరియు శపించబడిన పుస్తకం, అన్‌సంగ్ కింగ్ ఆఫ్ ఎ ఫాలెన్ కింగ్‌డమ్ మరియు ప్రతి ఆరు సంవత్సరాలకు రిపీట్ అయ్యే  దుర్మార్గపు శాపం గురించి తెలుస్తుంది. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్న ఆమె ఈ శాపాన్ని ఛేదించడానికి ఏమి చేసింది? ఈ చీకటి కథ డిమోంటి కాలనీకి ఎలా కనెక్ట్ అవుతుంది? శపించబడినా  పుస్తకాన్నీ హాస్టల్ అమ్మాయిలు ఎందుకు చదివారు ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ :

లవర్ ఆత్మహత్య గురించి తెలుసుకొందామనే ప్రయత్నంలో ఆత్మల రాజు అయినా డిమోంటి ని ఎదుర్కోవడం. ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

మొదటగా  ప్రియా భవానీశంకర్ నటన గురించి మనం చెప్పుకోవాలి.  సామ్ ఆత్మతో మాట్లాడే సీన్ లో అద్భుతంగా చేసింది. అరుంధతి లో అనుష్క నటనని గుర్తుకు తెచ్చేలా చేసింది. అరుళ్ నిటి ట్విన్స్ గా బాగా నటించాడు. అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్ తదితరులు తమ పరిధిలో నటించారు.

టెక్నికల్ గా :

దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు కథను డీల్ చేసిన విధానం, ప్రీక్వెల్‌ కి సినిమాను కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అజయ్ జ్ఞానముత్తు, వెంకీ వేణుగోపాల్ మరియు రాజవేల్ స్క్రీన్ ప్లే, సినిమా సస్పెన్స్ టోన్‌ని ఎఫెక్టివ్‌గా మెయింటైన్ చేసారు.

హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది.  సామ్ సిఎస్ స్కోర్ చాలా బాగుంది. సినిమా టెన్షన్ మరియు ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేలా మ్యూజిక్ ఉంది. కుమారేష్ డి ఎడిటింగ్ చక్కగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. CGI వర్క్ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా నీట్‌గా ఉండటంతో స్ట్రెయిట్ సినిమా అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

ప్రియా భవానీ శంకర్ నటన ,

ఫస్ట్ హాఫ్

హార్రర్ ఎలెమెంట్స్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

తీర్పు :

రెండో సారి భయపెట్టిన డిమోంటి కాలనీ..

నటీనటులు:

అరుళ్నితి, ప్రియా భవానీశంకర్, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ తదితరులు.

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : డిమోంటి కాలనీ 2
బ్యానర్: బిటిజి యూనివర్సల్
విడుదల తేదీ: 23-08-2024
సెన్సార్ రేటింగ్: U/A
దర్శకత్వం: అజయ్ ఆర్ జ్ఞానముత్తు
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్
ఎడిటింగ్: కుమారేష్ డి
నిర్మాత: విజయసుబ్రమణియన్, ఆర్‌సి రాజ్‌కుమార్
రన్టైమ్: 143 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్