Devara Hero NTR Top 10 Songs
దేవర హీరో ఎన్టీఆర్ టాప్ 10 సాంగ్స్
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఆయన నటన, డైలాగ్స్, డ్యాన్స్ గురించి ముందు చెప్పాలి. నందమూరీ అభిమానులకు ఎనర్జీ అంటే బాలయ్య తరువాత ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఏది చేసినా చాలా సెలక్టీవ్‌గా చేస్తారు. అందుకే నందమూరి ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉన్నా ఎన్టీఆర్ ప్రత్యేకం. తెలుగు పరిశ్రమలో అంతమంది నటులు ఉన్న ఎన్టీఆర్ ఎప్పుడూ స్పెషల్ . ఆయన సినిమాల విషయంలో మాత్రమే కాదు పాటల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు. అందుకే ఆయన పాటలు పెద్ద హిట్ అవుతాయి. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో జనాదరణ పొందన టాప్ 10 పాటలు ఒకసారి చూద్దాం.
10. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదులమ్మ చెట్టు నడలో
ఈ పాట స్టూడెంట్ నెం.1 చిత్రంలోనిది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 2001లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు మంచి పేరు వచ్చింది. ఇక ఈ పాట ప్రతీ ఫెయిర్‌వెల్ పార్టీలో కచ్చితంగా ప్లే అవుతుంది. ఇద్దరు ఆస్కార్ అవార్డు గ్రహితలు ఈ పాటకు కలిసి పనిచేశారు. చంద్రబోస్ రచయితగా ఎం.ఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించారు. ఈ పాటతో పాటు పడ్డనండి ప్రేమలో మరి అనే సాంగ్ సైతం అద్భుతంగా ఉంటుంది.
9. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పుడిగిందే ఇవ్వద్దు.. ఇవ్వద్దు
వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది చిత్రంలో అన్ని పాటు చాలా బాగుంటాయి. అందులో నీ నవ్వుల తెల్లదనాన్నిసాంగ్ ఇప్పటికీ ట్రెండ్‌లో ఉంటుంది. ప్రముఖ ఆస్కార్ రైటర్ చంద్రబోస్ కలం నుంచి జాలువారిన ఈ పాటకు మణిశర్మ బాణీ కట్టారు. ఈ అద్భుతమైన పాటను మల్లికార్జున్ మన్సూర్, సునిత కలిసి ఆలపించారు.
8. ఒక కొంటే పిల్లనే చూశా.. సెంటిమీటర్ నవ్వమని అడిగా.. తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే
డీకీ సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన నాగ చిత్రంలో ఒక కొంటే పిల్లనే చూశా అనే సాంగ్ అందరి మనసును దోచింది. దేవా మ్యూజిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాటను కార్తిక్, హరిహరన్, అనురాధా శ్రీరాం ముగ్గురు సింగర్లు ఆలపించారు.
7. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి..
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన రెంవడ చిత్రం సింహాద్రి. ఈ చిత్రంలోని పాటలు అన్నీ బాగున్నా ఎక్కువ ప్రజాదరణ పొందింది మాత్రం నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా.. తిప్పు, చిత్ర ఇద్దరు పాడారు.
6. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజుల తెస్తానే..
రాజమౌళితో ఎన్టీఆర్ ముచ్చటగా మూడోసారి నటించిన చిత్రం యమదొంగ. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రబ్బరు గాజులు రబ్బరు గాజలు సాంగ్ అందరినీ ఆకర్షించింది. ప్రముఖ పాటల రచయిత అనంత్ శ్రీరామ్ రాయగా.. ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను దలేర్ మెందీ, ప్రణవి కలిసి ఆలపించారు.
ఈ చిత్రంలో నాచోరే నాచోరే సాంగ్, నునుగు మీసాలోడు పాటలు కూడా అద్భతంగా ఉంటాయి.
5. శివ శంబో శివ శంబో శివ శంబో శివ శంబో
వీవీ వినాయక్ దర్శకత్వంలోవచ్చిన అదుర్స్ చిత్రంలో శివ శంబో శివ శంబో ఇప్పటికి డ్యాన్స్ బిట్‌గా ఉంటుంది. ఈ పాటను ముగ్గురు రైటర్ రావడం విశేషం. చంద్రబోస్, కులశేఖర, రామజోగయ్య శాస్త్రి రాశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
4. ప్రేమదేశం యువరాణి
మెహర్ రమేస్ దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మించిన చిత్రం శక్తి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా పాటలు ఆకట్టుకున్నాయి. అందులో రామజోగయ్య శాస్త్రీ రాసిన ప్రేమదేశం యువరాణి పాట చాలా బాగుంటుంది. మణిశర్మ సంగీతం అందించగా హేమచంద్ర, సైందవి ఆలపించారు.
3. చూలేంగే ఆస్మా
పూరి జగన్నాథ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఓ సాలిడ్ హిట్లో ఎప్పుడూ సాంగ్స్ కూడా పాలు పంచుకుంటాయి. ఇక టెంపర్ సినిమాలో చూలేంగే ఆస్మా సాంగ్ ఎప్పుడూ విన్నా ఫ్రెష్‌గానే ఉంటుంది. విశ్వ రచనకు అనుప్ రూబెన్స్ సంగీతం అందించగా, రమ్య బెహరా, అద్నాన్ సామి, వీణ ఘంటసాల ఆలపించారు.
2. లవ్ దెబ్బ
నాన్నకు ప్రేమతో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తొలిసారిగా నటించారు. సినిమాతో పాటు పాటలు సైతం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా లవ్ దెబ్బ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు. దీపక్, శ్రావణ భార్గవి పాడరు. ఇదే సినిమాలో లవ్ మీ ఏగైన్ పాట కూడా చాలా బాగుంటుంది.
1. ప్రణామమ్ ప్రణామమ్ ప్రణామమ్ ప్రభాత సూర్యుడికి ప్రణామమ్..
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం ఎన్టీఆర్‌కు మంచి హిట్‌ను అందించింది. ఈ చిత్రంలో రామజోగయ్య శాస్త్రి రాసిన ప్రణామమ్ ప్రణామమ్ ప్రణామమ్ ప్రభాత సూర్యుడికి ప్రణామమ్ పాటకు దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టి మ్యూజిక్ అందించగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ అద్భుతంగా ఆలపించారు.
ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలోని పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అందులో చుట్టమల్లే చుట్టేస్తాందే తుంటరి చూపే పాట ట్రెండింగ్‌లో ఉంది. రామజోగయ్య శాస్త్రి రచయితగా సెన్సెషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. శిల్పరావ్ పాడారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.