Reading Time: 3 mins

Devara Director Koratala Siva

దేవర డైరెక్టర్ కొరటాల శివ 

తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. సామాజిక అంశాలకు కమర్షల్ హంగులు అద్ది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం కొరటాల శివ స్టైల్. స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన, తీసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్నీ పెద్ద బ్యానర్, స్టార్ హీరోలు కావడం గమనార్హం. ఇక కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఏదో ముఖ్యమైన పాయింట్‌తో వస్తున్నారని ప్రేక్షకులు ఎదురుచూసేలా చేసుకున్నారు. కమ్యూనిస్ట్ సిద్దాంతాలను గౌరవించే కుటుంబం నుంచి వచ్చారు కాబట్టే ఆయన తెరకెక్కించే సినిమాలో సమాజం, ప్రకృతి పట్ల ఎంతో కొంత బాధ్యతను జోడిస్తారు.

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల వైపు అడుగులు వేశారు. ప్రముఖ రైటర్, యాక్టర్, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి వద్ద స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2002లో ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు కథ ఇచ్చారు. ఆ తరువాత ‘ఒక్కడున్నాడు, భద్ర, మున్నా, బృంధావనం, ఊసరవెళ్లి’ వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. ‘సింహా’ చిత్రానికి స్టోరీ అండ్ డైలాగ్ రైటర్‌గా పని చేశారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొరటాల శివకు తాను డైరెక్టర్ కావాలనే ఆలోచనతో సొంత ప్రయత్నాలు మొదలు పెట్టారు. చివరగా 2011లో ఊసరవెళ్లి చిత్రానికి డైలాగ్ రైటర్‌గా పనిచేసి 2012లో ‘మిర్చి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మిర్చి(2012)
వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేది ఏముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనే డైలాగ్‌తో మిర్చి మూవీని ఒక్క మాటలో చెప్పి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌లోని క్లాస్, మాస్ రెండు కోణాలను అద్భుతంగా వాడుకొని డెబ్యూ దర్శకుడే అయినా.. ఆయన పని చేసిన అన్ని సినిమాల తాలుక అనుభవాన్ని తెరమీద చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఈఫీస్ వద్ద రూ. 87 కోట్ల వరకు వసుళ్లు సాధించింది.

శ్రీమంతుడు(2015)
సంపాదించిన దాంట్లో కొంతైనా పుట్టి, పెరిగిన గ్రామానికి ఉపయోగించాలనే సందేశంతో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా మంచి కమర్షల్ హిట్ అందుకుంది. కోటీశ్వరుడైన హీరో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. ఇదే పాయింట్‌కు కమర్షలు హంగులను జోడించి బాక్స్ ఆఫీస్ నుంచి రూ. 140 కోట్లకు పైగా వసుళ్లను సాధించారు. ఈ సినిమా ప్రభావంతో మహేష్ బాబు బుర్రపాలేం అనే గ్రామాన్ని దత్తత కూడా తీసుకున్నారు. దీంతో డైరెక్టర్ ఏ సినిమా చేసినా ఒక సామాజిక సృహతో తీస్తున్నారు అనే ముద్ర వేసుకున్నారు.

జనతా గ్యారేజ్(2016)
ప్రకృతిపై ప్రేమతో ఆనంద్, మనుషులను సరిచేసే మెకానిక్‌గా సత్యం వీరిద్దరు కలసి చేసే జర్నీతో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్. ఎన్టీఆర్‌ మాస్ చిత్రాలు చేశారు, క్లాస్ చిత్రాలు చేశారు. కానీ జనతా గ్యారేజ్ చిత్రంలో ఆయన నటన, స్వాగ్ చూశాక కొరటాల హీరోలకు మాత్రమే ఇలా చేయడం సాధ్యమేమో అనిపించేలా చేశారు. ఈ చిత్రంలో అంతర్లీనంగా మంచి సందేశాన్ని అందించారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం రూ. 140 కోట్ల వరకు సాధించింది.

భరత్ అనే నేను(2018)
ఒక రాజకీయ నాయకుడు బాధ్యతయుతంగా ఉంటే సమాజంలో ఏం జరుగుతుంది. ఏ పోలిటికల్ లీడర్‌కు అయిన జవాబుదారి తనం ఉండడం ఎంత ముఖ్యమో చెప్పిన చిత్రం భరత్ అనే నేను. ఈ కథను సైతం కమర్షల్ ఫార్మెట్‌లో తెరకెక్కించి మంచి హిట్‌ను అందుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి పొలిటికల్ బ్యాగ్‌డ్రాఫ్‌లో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ చిత్రం ద్వారా అకౌంటబులిటీ‌పై ప్రజలకు కూడా మంచి అవగాహన కల్పించారు.

ఆచార్య(2022)
మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్లతో తెరకెక్కించిన చిత్రం ఆచార్య. సిద్దవనం సమీపంలో ధర్మస్థలి, పాదగట్టం అనే రెండు గ్రామాలు ఉంటాయి. అక్కడే ఉండే గ్రామస్తులు దేవలాయన్ని కాపాడాలి అనుకుంటారు. అదే గ్రామంలో ఉండే కొంత మంది గుడిని కూల్చి మైనింగ్ చేయాలి అనుకుంటారు. ఆ దేవలయాన్ని కపాడే నక్సల్ కథతో ఆచార్య సినిమాను తెరకెక్కించారు. కొరటాల శివ తీసిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. కానీ ఆచార్య ఫలితం నిరాశపరిచింది. ఆచార్య సినిమా కొరటాలకు కొంత నష్టాన్ని తీసుకొచ్చింది. అయినా సరే అధైర్య పడకుండా ముందుకు సాగుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా దేవర చిత్రాన్ని తెరకెక్కిస్తూనే.. ‘కృష్ణమ్మ’ అనే చిత్రాన్ని ప్రసెంట్ చేశారు.

దేవర(2024)
మరో సారి జూనియర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం దేవర. కోస్టల్ ఏరియాలో సముద్రపు దొంగలను దోచుకునే దొంగగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, రెండు పాటలు విడుదల చేశారు. సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విడుదలై రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా ప్రేక్షకులు సైతం ఈ చిత్రం వైపు ఆసక్తిగా చూస్తున్నారు.