Devara Hero Jr Ntr Hit Dialogues
దేవర హీరో జూనియర్ ఎన్టీఆర్ హిట్ డైలాగ్స్
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటన, డ్యాన్స్‌లు మాత్రమే కాదు డైలాగ్స్ కూడా ఎంతో అద్భుతంగా చెప్తారు. అందుకే ఆయన సినిమాల్లో డైలాగ్స్ చాలా ప్రత్కేకంగా ఉంటాయి. చిన్న చిన్న పంచ్ డైలాగ్స్‌తో పాటు పేజీల పేజీల డైలాగ్స్ చెప్పి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకునే నటుడు ఎన్టీఆర్. ఆయన డైలాగ్స్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అలా ఆయన నటించిన 29 సినిమాల్లో మంచి డైలాగ్స్ ఏంటో చూద్దాం.
1. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా
వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది చిత్రం ఎన్టీఆర్ ఇమేజ్‌ను మార్చసింది. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది.
2. రేయ్ ఈ సింహాద్రి మీసం మీద చేయి వేస్తే పాతాలం నుంచి అగ్ని పర్వతం బద్దలై పైకి లేస్తుంది. మాడిపోతావ్.. మసైపోతావ్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం సింహాద్రి. ఎన్టీఆర్‌లోని పూర్తి మాస్ కోణాన్ని అవిష్కిరించిన చిత్రం ఇది.
3. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది కానీ టచ్ చేస్తే దీనమ్మ షాకే సాలీడ్‌గా ఉంటుంది.
4. నీకు వంద మంది కనబడుతున్నారేమో నేను మాత్రం ఒక్కడినే కమిట్ అయ్యా వాడొక్కడే కనబడుతున్నాడు. యుద్దం మొదలు పెట్టాక కంటికి కనిపించాల్సింది టార్గెట్ మాత్రమే.
5. రే పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో.. పులితో ఫోటో దిగాలని పించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పరువలేదు ట్రై చేయచ్చు.. సరే చనువించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడెస్తాది.
6. సైకిల్ మీదొచ్చి చరిత్ర సృష్టించిన చరిత్ర మరిచి పోయారా.. లేదా ఇంకెవడు సైకిల్ మీద రాడనుకున్నారా
7. ఏ లాయరు నల్లకోటు వేసుకున్న వాడికి నాలుక చాలా అవసరం దాన్ని ఉంచుకో తెంచుకోకు.
8. నా ముందు తొడ కొడితే తొడా, మెడా రెండు నరికేస్తా దించు.. దించు
9. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్‌గా ఉన్నాడు లవర్ బాయ్ అనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా ఉంది అని ట్రై చేశా.. లోపల ఒరిజినల్ అలానే ఉంది. దానిని బయటకు తెచ్చావు అనుకో రచ్చ, రచ్చే
10. మూర్తి ఆ అమ్మాయిని చూశావా.. అనిమల్ లవర్ అంటా.. మనకంటే పెద్ద అనిమల్ ఎవడు ఉన్నారు ఇక్కడ.
11. నీకు ఈగో లోపల ఉంటుందేమో నాకు వైఫైలా చుట్టూ ఉంటుంది. యూజర్ నేమ్ దయా, పాస్ వర్డ్ పోలీస్.. దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర.
12. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం అనవాయితి బట్ ఫరే ఛేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంది.. జనతా గ్యారేజ్
2016 కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతాగ్యారేజ్ సైతం ఎన్టీఆర్‌కు మంచి హిట్ ఇచ్చింది.
13. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణున్ని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా.. ఉందా
ఆ తరువాత త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవ కుశ. బాబీ కొల్లు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్‌లోని నెగిటీవ్ కోణాన్ని సైతం చూపించింది.
14. వంద అడుగుల్లో నీళ్లు పడుతాయని తెలిసి 99 అడుగులు తవ్వి వదిలేసే వాడిని ఏం అంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా
15. పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా
16. వినే టైమ్ చెప్పే మనిషి వలన విషయం విలువే మారిపోద్ది నీలాంబరి.
17. బతకండి, బతకండి అంటే వినలేదు కదరా కోత మొదలైంది రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు.
18. రామయ్య వస్తావయ్య సినిమాలో బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలుడదీసి కొడుతా అనే డైలాగ్ కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయింది.
19. పాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా గర్వంతో గీ మన్నులో కలిసి పోతనే
20. తొంగి తొంగి నక్కి నక్కి గాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోడిని ఏసుకుంటు పోవాలి.
ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. అందులో సింగిల్ సైన్ డైలాగ్స్‌లో ప్రేక్షకుల నోట్లో నానిన డైలాగ్స్ మాత్రమే ఇవ్వి. నరసింహుడు, యమదొంగ లాంటి సినిమాల్లో ఇంకా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. వాటి గురించి సైతం మరో ఆర్టకల్‌లో చర్చిద్దాం.