Devara Hero NTR Hits And Flops
జూనియర్ ఎన్టీఆర్ దేవర హీరో హిట్స్ అండ్ ఫ్లాప్స్
నందమూరి తారక రామారావు ఆయనే జూనియర్ ఎన్టీఆర్.. వెండితెరపై సీనియర్ ఎన్టీఆర్ లేని లోటును ఆయన మనవడిగా తారక్ బర్తీ చేస్తున్నారు. నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డైలాగ్స్, డ్యాన్స్ వేయడంలో తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అనేది అక్షర సత్యం. బాలనటుడిగా వెండితెరను పరిచయం చేసుకొని ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌తో భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించేదగ్గ స్థాయిలో ఉన్నారు. చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలం అని నమ్మీ అకుంఠిత దీక్ష, పట్టుదలతో నిత్యం వినుత్నమైన కథలతో అలరించి.. అభిమానులు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఆయన తెరపై పోషించే పాత్రలే ఎన్టీఆర్ నటనకు మురిసిపోతాయి. కానీ ఎంత పెద్ద నటుడికైనా హిట్స్, ఫ్లాప్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆ అనుభవాన్న ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన సినిమాల్లో ఎన్ని హిట్స్ , ఎన్ని ఫ్లాప్స్ అనేవి ఒక సారి సమీక్షిద్దాం.
నిను చూడాలని(2001): 2001లో నిను చూడాలని చిత్రంతో నందమూరి నటవారసుడిగా, డెబ్యూ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీ రావు రూపొందించిన ఈ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
స్టూడెంట్ నెం.1(2001): ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఎన్టీఆర్ సెకండ్ సినిమా స్టూడెంట్ నెం1. వైజయంతి అధినేత అశ్వినీ దత్ చిన్న బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడానికి స్వప్న సినిమా అనే ప్రొడక్షన్ కంపెనీ పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు రూ. 1 కోటి 80 లక్షలు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమా రూ. 12 కోట్లు వసుళ్లు సాధించి థియేటర్ దగ్గర తిరుగులేని విజయాన్ని సాధించింది.
సుబ్బు(2001): రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వంలో అదే సంవత్సరం ముచ్చటగా మూడోవ సినిమా సుబ్బు. స్టూడెంట్ నెం 1 తరువాత సుబ్బు వచ్చి ఫ్లాప్‌గా నిలిచింది.
ఆది(2002): వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది చిత్రం ఎన్టీఆర్ ఇమేజ్‌ను మార్చేంత పెద్ద హిట్ అయింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది.
అల్లరి రాముడు(2002): ఫ్యాక్షన్, యాక్షన్ చిత్రలకు మంచి పేరున్న దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల్లరి రాముడు. కుటుంబ కథా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
నాగ(2003): ఏఎమ్ రత్నం నిర్మాతగా, డీకీ సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నాగ. పొలిటికల్, స్టూడెంట్ లైఫ్ ల మధ్య జరిగే ఈ యాక్షన్ డ్రామా పెద్దగా ఆడలేదు. నాగ చిత్రం డిజాస్టార్ టాక్ తెచ్చుకుంది.
సింహాద్రి(2003): ఎస్ఎస్ రాజమౌళి రెండవ చిత్రం సైతం ఎన్టీఆర్‌తోటే తీశారు. అదే సింహాద్రి. ఎన్టీఆర్‌లోని పూర్తి మాస్ కోణాన్ని అవిష్కిరించిన చిత్రం ఇది. దాదాపు రూ. 8 కోట్ల 50 లక్షలతో తెరకెకక్కిన ఈ చిత్రం రూ. 25 కోట్ల 70 లక్షల వరకు సంపాదించి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపే కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నలిచింది.
ఆంధ్రవాలా(2004): డబుల్ రోల్‌లో ఎన్టీఆర్ కనిపంచారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
సాంబ(2004): వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాంబ. అందరూ చదువుకోవాలని ఫ్యాక్షన్ బ్యాగ్‌డ్రాఫ్‌లో తెరకెక్కిన సాంబ చిత్రం హిట్‌గా నిలిచింది.
నా అల్లుడు(2005): ఎన్టీఆర్ హీరోగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నా అల్లుడు. ఈ చిత్రం ఫ్లాప్ రిజల్ట్ తెచ్చుకుంది. కానీ చిత్రం ఆద్యాంతం కామెడీతో సాగుతుంది.
నరసింహుడు(2005): నరసింహుడు చిత్రంలో ఎన్టీఆర్ నటన ఆకట్టున్నప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం అయింది.
అశోక్(2006): సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం ఆశోక్ పెద్దగా ఆడలేదు.
రాఖీ(2006): క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో మంచి సెంటిమెంటల్ కథ రాఖీ. ఈ చిత్రం సైతం అభిమానులను ఆకట్టుకోలేదు. థియేటర్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
యమదొంగ(2007 ): వరుగా ఫ్లాప్స్‌లో ఉన్న సమయంలో మళ్లీ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం యమదొంగ. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. యముడిగా మోహన్ బాబు ఆకట్టుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను తలపించే డైలాగ్‌లతో జూనియర్ విజృంభించాడు. దాంతో ప్రేక్షకులు థియేటర్లకు నిరాజనాలు పట్టారు. యమదొంగ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కంత్రి(2008): మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి సినిమా థియేటర్లో పెద్దగా ఆడలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చింతకాయల రవి చిత్రంలో ఓ పాటలో మెరిశారు.
అదుర్స్(2010): వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అదుర్స్ చిత్రం ఎన్టీఆర్‌కు మంచి హిట్‌ను అందించింది. రెండు విభన్న పాత్రల్లో ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. ఆయన వేసిన చారీ పాత్ర ఇప్పటికీ నవ్వులు పూయిస్తూనే ఉంటుంది.
బృందావనం(2010): వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా చిత్రం బృందావనం. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం మంచి ఫ్యామిలీ హిట్ కొట్టింది.
శక్తి(2011): మెహర్ రమేస్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై బడ్జెట్ మూవీ డిజాస్టర్ అయింది. అశ్వినీ దత్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది.
ఊసరవెల్లి(2011): సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఊసరవెళ్లి చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
దమ్ము(2012): బోయపాటి దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రం ఎన్నో అంచనాల నడుమ వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
బాద్షా(2013): శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి హిట్ సాధించింది. ఈ చిత్రంలో బ్రహ్మనందం క్యారెక్టర్ చాలా స్పెషల్‌గా మిగిలింది.
రామయ్య వస్తావయ్య(2013): హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రామయ్య వస్తావయ్య చిత్రం ఫ్లాప్ అయింది.
రభసా(2014): కొత్త దర్శుకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన రభసా చిత్రం ఎన్టీఆర్‌కు వరుసగా ఆరవ ఫ్లాప్‌ను అందించింది. దీంతో ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారు.
టెంపర్(2015): పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రవాల తరువాత వచ్చిన చిత్రం టెంపర్. 2015లో వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ అభిమానులకు సంతోషంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించింది.
నాన్నకు ప్రేమతో(2016): సుకుమార్ దర్శకత్వంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో చిత్రం మంచి విజయాన్ని అందించింది.
జనతాగ్యారేజ్ (2016): కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతాగ్యారేజ్ ఎన్టీఆర్‌కు మంచి విజయాన్ని ఇచ్చింది. రూ.40 నుంచి 50 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 135 కోట్లను దాటిన వసుళ్లన సాధించి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
జై లవ కుశ(2017): కే.ఎస్ రవింద్ర అలియాస్ బాబీ కొల్లు దర్శకత్వంలో వచ్చిన జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. ఈ చిత్రం ఎన్టీఆర్‌లోని నెగిటీవ్ కోణాన్ని సైతం చూపించి మెప్పించారు. థియేటర్ వద్ద ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
అరవింద సమేతా వీరరాఘవ(2018): మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 2018లో విడుదలైన చిత్రం అరవింద సమేతా వీరరాఘవ. దాదాపు రూ. 150 కోట్ల వరకు వసుళ్లు సాధించింది. థియేటర్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆర్ఆర్ఆర్(2022): ఎన్టీఆర్ మూడు సంవత్సరాలు కొమరం భీమ్ పాత్రకోసం తనను తాను మలుచుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం 2022లో విడుదలైంది. దాంతో ఎన్టీఆర్ అంటే ఏంటో ప్రపంచం చూసేలా చేసింది. ఆస్కార్ వేదికలపై ఎన్టీఆర్‌ను నిలబెట్టింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ర దేవర చిత్రంలో కొరటాల శివ దర్శకత్వంలో రెండవ సారి నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందో. దీనితో పాటు తొలిసారిగా ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న చిత్రం వార్2. మొదటి సారి నార్త్‌లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ లక్ ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులు ఆరాట పడుతున్నారు. అయితే ఎన్టీఆర్ హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఫ్లాప్స్ వచ్చినప్పుడు కుంగిపోలేదు.. సంతోషం అయినా దు:ఖం అయినా సమానంగా స్వీకరించి ముందుకు కదులుతున్న ఎన్టీఆర్ తన సినిమా ప్రపంచంలో మరిన్ని చిత్రాలు అందించాలని కోరుకుందాం.