Reading Time: 2 mins

Devara Heroine Janhvi Kapoor

దేవర హీరోయిన్ జాన్వీ కపూర్

అతిలోక సుందరిగా వెండితెరపై వెలుగులు వీరాజిల్లిన అందాల తారా శ్రీదేవి. తన నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శ్రీదేవి బోనీకపూర్‌ల కూతురు జాన్వీ కపూర్. మెరుపుల్లాంటి కళ్లు, అందమైన సొగసుతో మొదటి సినిమాతోటే ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయింది. వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. జాన్వీ కపూర టాలీవుడ్‌లోకి అడుగుపెట్టక ముందే తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. బహుషా శ్రీదేవిపై ఉన్న అభిమానం కావచ్చు. ఈ తరుణంలో తెలుగు తెరపై నటించే అవకాశం అందుకుంది. ఎన్టీఆర్ సరసన చేసే ఆఫర్ కొట్టేసింది ఈ చిన్నది. ఇంకా సినిమా పూర్తి కాలేదు అప్పుడే మరో అవకాశం దక్కించుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడిగా చేయనుంది. దీనికి సంబంధించిన పూజ కార్యక్రమం సైతం అయిపోయిన విషయం తెలిసిందే.

జాన్వీ కపూర్ 6 మార్చ్, 1997లో ముంబయిలో పుట్టింది. అప్పటికే సినిమాల్లో తారా స్థాయికి చేరుకున్న అందాల నటి శ్రీదేవి కూతురు కావడం, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ జాన్వీ తండ్రి కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే ఉండేది. దాంతో సహజంగానే సినిమాలవైపు దృష్టి మల్లుతుంది. ఈ నేపథ్యంలో మోడలింగ్ చేసిన జాన్వీ ఆ తరువాత అనుకున్నట్లుగానే సినిమాల్లోకి అడుగుపెట్టింది. తన 21 ఏట ‘దడక్’ అనే హిందీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత వరుసగా ఘోస్ట్ సిరీస్, రూహీ, గుడ్ లక్ జెర్రీ చిత్రాలు చేసింది. ఆ తరువాత 2023లో వరుణ్ దావన్ హీరోగా తెరకెక్కిన బవాల్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో జాన్వీకి మంచి గుర్తింపు వచ్చింది.

వీటి తరువాత మిస్టర్ అండ్ మిస్ మహి చిత్రానికి సైతం విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత అమ్మడి కళ్లు తెలుగు తెరపై పడ్డాయి. తెలుగులో నటించాలన్న తన కోరికను జాన్వీ చాలా సార్లు బాహటంగానే చెప్పింది. తన తల్లి హీరోయిన్‌గా మొదలైంది తెలుగు నుంచే కదా.. అందుకే తెలుగు అంటే ప్రత్యేక గౌరవం అని కూడా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది. అదే సమయంలో కొరటాల శివ ఎన్టీఆర్ తో మూవీ ఒకే అయింది. హీరోయిన్ కోసం కొత్తవాళ్లను వెతుకుతుండగా జాన్వీ చిక్కింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జాన్వీకి ఇది మంచి అవకాశం. ఇప్పటికే విడుదలైన చుట్టమల్లే సాంగ్‌లో జాన్వీ లుక్ అదిరిపోయింది. రెండు పార్టులుగా విడుదల అవుతున్న ఈ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో రామ్ చరణ్‌తో నటించనుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో ఆర్సీ17 చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఓకే చేశారు. అంతే కాకుండా తెలుగు మరిన్ని చిత్రాలకు సైన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. తాను ఒకే సారీ రెండు పెద్ద ప్రాజెక్టులకు పని చేస్తుంది. దాంతో తదుపరి చిత్రం ఒప్పుకోవడానికి కాస్త టైమ్ పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా తీసిన కొన్ని సినిమాలకే స్టార్ హీరోయిన్ రావడం అనేది అతి కొద్దిమంది హీరోయిన్లకే సాధ్యం అవుతుంది.