Reading Time: < 1 min

Devara Movie Revised Ticket Rates
పెరిగిన దేవర మూవీ టికెట్ రేట్స్

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టీలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్ ప్రారంభం కాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకొవచ్చని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.

 

ఈ మేరకు టికెట్ రేట్ల విషయంలో మల్టీప్లెక్స్ లలో రూ. 135, సింగిల్ స్క్రీన్ లో ఫస్ట్ క్లాస్ రూ. 110, సెకండ్ క్లాస్ లో రూ. 60 పెంచుకునే అవకాశం ఇచ్చింది. అంటే తెలంగాణ మల్టీప్లెక్స్ లలో రూ. 413, సింగిల్ స్క్రీన్ లలో ఫస్ట్ క్లాస్‌ టికెట్స్ రూ. 250, సెకండ్ క్లాస్ లలో రూ. 150 ఉంటుంది. ఆంధ్ర విషయానికి వస్తే మల్టీప్లెక్స్ లో రూ. 325, సింగిల్ స్క్రీన్ లలో ఫస్ట్ క్లాస్ టికెట్స్ రూ. 200, సెకండ్ క్లాస్ రూ.100 అవుతుంది. దేవర సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యసుధ ఆర్ట్స్ సంయుక్తంగా మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక దేవర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.