Reading Time: 2 mins

Devara Music Director Anirudh Ravichander

దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ 

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే మాట వినే ఉంటారు. ఇదే పరిణామం సెన్సేషనల్ అండ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విషయంలో చోటుచేసుకుంది. అనిరుధ్ రవిచందర్ ఈ పేరు సంగీత ప్రపంచంలో ఓ సెన్షేషన్. చిన్న వయస్సులో ఇండస్ట్రీకి వచ్చి తన ప్రతిభను చాటుకొని.. సంగీత ప్రియుల హృదయాలపై మ్యూజిక్‌తో సంతకం చేశారు. వీరిది కళాకారుల కుటుంబం, 1990 అక్టోబర్ 16 న జన్మించారు. తండ్రి రాఘవేంద్ర నటుడు, తల్లి శాస్త్రీయ నృత్యకారిణి లక్ష్మీ రవిచందర్. అంతేకాకుండా రజనీకాంత్ సైతం వీరి బంధువే. సూపర్‌స్టార్ భార్య లత రజనీకాంత్ మేనల్లుడు అనిరుధ్. కళాకారుల కుటుంబంలో పుట్టనంత మాత్రాన ఎవరూ ఆర్టిస్టులు కాలేరు ప్రతిభ మాత్రమే అతనికి పేరుప్రతిష్ఠలు తీసుకొచ్చింది అనేది సత్యం. చదువుకునే రోజుల్లోనే మ్యూజిక్‌ కంపోజింగ్ నేర్చుకున్నారు. అలా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య పనిచేసే కమర్షియల్ యాడ్స్‌కు అనిరుధ్‌తో మ్యూజిక్ చేయించుకుంది. అలాగే సంగీతంతో అనిరుధ్ ప్రయాణం సాగింది.

తన 21 ఏట మొదటి సారి సినిమాకు మ్యూజిక్ అందించారు. ఐశ్వర్య రజనీకాంత్ ప్రొడ్యూసర్‌గా దనుష్, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన 3 సినిమాకు అనిరుధ్ పనిచేశారు. ఇక చిత్రం విడుదలకు ముందే వై దిస్ కోలవెరి సాంగ్ వైరల్ అయింది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో టాప్ వ్యూస్ ఉన్న సాంగ్ అది. అంతే కాకుండా త్రీ సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మిగితా పాటలు సైతం అందరిని ఆకట్టుకున్నాయి. దాంతో తమిళ పరిశ్రమ మొత్తం అనిరుధ్ వైపు తిరిగింది. ఈ చిత్రం తరువాత ఎతిర్ నీచల్(Ethir Neechal), డేవిడ్(David), వనక్కం చెన్నై(Vanakkam Chennai), ఇరందమ్ ఉలగమ్(Irandam Ulagam) తెలుగులో వర్ణ, రఘువరన్ బి.టెక్ వంటి చిత్రాలకు మ్యాజిక్ అందించారు.

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా, మురగదాస్ డైరెక్టర్‌గా తెరకెక్కిన ‘కత్తి’ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందించారు. దానికి తరువాత ఆయన కెరీర్ పీక్స్‌కు వెళ్లింది. వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘మారి”కి పనిచేశారు. ఇక 2015లో నయనాతార, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన నేను రౌడినే చిత్రానికి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. అలా 25 ఏళ్ళ వయసుకే పదిహేను సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. కేవలం తమిళ చిత్రాలకే కాకుండా తెలుగు చిత్రాలకు సైతం అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రజనీకాంత్ నటించిన పేటా, దర్బార్, జైలర్ చిత్రాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించారు. అలాగే విజయ్ మాస్టర్, బీస్ట్, లియో, అంతే కాకుండా శివకార్తికేయన్ నటించిన డాక్టర్ వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పనిచేశారు.

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రానికి తొలిసారి తెలుగులో డైరెక్ట్‌గా పనిచేశారు. అన్ని పాటలు అద్భుతంగా ఉన్నాయి కానీ సినిమా పెద్దగా ఆడలేదు. మళ్లీ కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న అనిరుధ్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి   రెండు పాటలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక రెండు పార్టులుగా విడుదల అవుతున్న దేవరలో బీజీఎమ్ ఎలా కొడుతాడో అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రాలో కనిపించనున్నారు. యువసుధ ఎంటర్‌టైన్మెంట్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. దేవర సినిమా తరువాత తెలుగులో సైతం అనిరుధ్‌కు భారీగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.