Devara Producer Kalyan Ram Hits And Flops
దేవర నిర్మాత కల్యాణ్ రామ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి నటవారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మూడవతరం నటుల్లో ఆయన ఒకరు. హీరోగా సినిమాలు చేస్తూనే తాత నందమూరి తారక రామారావు పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవరకు సైతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి కల్యాణ్ రామ్ ది కష్టపడే తత్వం. ప్రతీ సినిమాకు తాను ఎంతో శ్రమిస్తారు. ఆయన మాట ఇచ్చాడంటే ఎంత ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్ అయినా సరే ఛాన్స్ ఇస్తాడు. అలా కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. అయినా సరే తాను మాట తప్పడు.
ఇప్పటి వరకు హిట్స్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా 21 చిత్రాలలో నటించారు. ఆయన సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమాలు మాత్రమే చేస్తారు. పౌరానికం మొదలు పెట్టి లవ్, యాక్షన్, డ్రామాలు అన్ని జానర్స్‌లో నటించి మెప్పించారు. అలా కొన్ని సినిమాలు హిట్‌గా నిలిచాయి మరికొన్ని ఫ్లాప్‌లు అయ్యాయి. కల్యాణ్ రామ్ నటించిన సినిమాలలో ఎన్ని హిట్లు, ఎన్ని ఫ్లాప్‌లు ఉన్నాయో చూద్దాం.
తొలిచూపులోనే(Average): బాలనటుడిగా తెరపై కనిపించిన కల్యాణ్ సోలో హీరోగా 2003లో తెరమీదకు వచ్చారు. తొలిచూపులోనే అందరినీ ఆకట్టుకున్నారు. నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం నటుడు కల్యాణ్ రామ్ నుంచి సినిమా అనగానే ప్రేక్షకులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు.
అభిమన్యు(Flop): మల్లి కార్జున మల్లి దర్శకత్వంలో 2003లో అభిమన్యు చిత్రం వచ్చింది. ముస్లీం అమ్మాయిని ప్రేమించిన, హిందూ అబ్బాయి ఆ తరువాత ఏం జరిగింది అనేది అసలు కథ. కానీ థియేటర్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
అతనొక్కడే(Super HIt): సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతనొక్కడే చిత్రం కల్యాణ్ రామ్‌కు మొదటి సక్సెస్. ఈ చిత్రంతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
అసాధ్యుడు(Flop): అన్ని కన్నెగంటి దర్శకత్వంలో వచ్చిన అసాధ్యుడు చిత్రం థియేటర్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
లక్ష్మీకళ్యాణం(Average): తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లక్ష్మీకళ్యాణం. ఈ సినిమాతో కాజల్ హీరోయిన్‌గా పరిచయం అయింది. కానీ సినిమా అనుకున్నంత ఆడలేదు.
విజయదశమి(Flop): తమిళంలో సూపర్ హిట్ అయిన శివకాశి సినిమాకు రీమేక్‌గా విజయదశమి చిత్రం తెరకెక్కింది. వి సముద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేక ఫ్లాప్‌గా నలిచిపోయింది.
హరేరామ్(Average): హర్షవర్దన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం హరేరామ్. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ కమర్షల్‌గా యావరేజ్‌గా మిగిలిపోయింది.
జయీభవ(Flop):నరేన్ కొండెపాటి తెరకెక్కించిన చిత్రం జయీభవ. ఫ్యాక్షన్ బ్యాగ్రాఫ్‌లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
కత్తి(Flop): మల్లి కార్జున్ దర్శకత్వంలో చెల్లెలు సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రం కత్తి. ఈ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. సినిమాలో కామెడీ ఉన్నప్పటికీ ఇది ఫ్లాప్‌గా నిలిచింది.
ఓం 3డీ(Disaster): సునిల్ రెడ్డి దర్శకత్వంలో కొత్త టెక్నాలజీ అంటూ తెరకెక్కించిన ఓం త్రీడీ చిత్రం మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
పటాస్(Super Hit): అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పటాస్‌లా పేలింది. దాంతో కల్యాణ్ రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఫ్లాప్‌లలో ఉన్న కల్యాణ్ రామ్ ఒక్క సినిమాతో బ్యాక్ వచ్చేశారు.
షేర్(Flop): ప్రముఖ రైటర్ డైమండ్ రత్నం బాబు రచయితగా మల్లి కార్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షేర్. ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది.
ఇజం(Average): డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఈ చిత్రం కోసం కల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ సైతం చేశాడు.
ఎమ్మెల్యే(Average): ఉపేంద్ర మాదవ్ దర్శకత్వంలో వచ్చిన ఎమ్మెల్యే చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. ఈ చిత్రం సైతం పెద్దగా ఆడలేదు.
నా నువ్వే(Flop): బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్న హీరోయిన్‌గా నటించిన నా నువ్వే చిత్రం 2018లో విడుదలైంది. మొదటి నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అడ్రస్ లేకుండా పోయింది.
ఎన్టీఆర్ కథానాయకుడు(Average): సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించారు. తరువాత పార్ట్2 గా ఎన్టీఆర్ మహానాయకుడు(2019)లో సైతం నటించారు.
118(Average): కే. వి గుహన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 118. మిస్టిరీయస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. హీరోకు వచ్చే ఓ కల ఆధారంగా ఓ అన్‌సాల్వుడ్ కేసును బయటపెడుతారు. సినిమా ఆద్యంతం కట్టిపడేసినా పెద్దగా కలెక్షన్లను కురిపించలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఎంతమంచి వాడవురా(Flop): సతీష్ వెగస్నా దర్శకత్వంలో కల్యాణ్ రామ్, బ్యూటీ మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఎంతమంచి వాడవురా చిత్రం ఫ్లాప్ అయింది.
బింబిసార(Block Buster): యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన అద్భతమైన సిినిమా బింబిసార. సోషియేఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఓ మైలు స్టోన్‌గా నిలిచింది. థియేటర్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అమిగోస్(Flop): రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అమిగోస్ చిత్రంలో కల్యణ్ రామ్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేశారు. సినిమా కథ క్రైమ్ మిస్టరీ చుట్టే తిరుగుతున్నా ప్రేక్షకులను ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేదు.
డెవిల్(Flop): అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన డెవిల్ చిత్రం థియేట్లో డివైడ్ టాక్ తెచ్చుకుంది. పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ ఇన్వేస్టిగేటింగ్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
ముందే చెప్పుకున్నట్లు ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఎంతో మందికి ఉపాది కల్పిస్తున్న నటుడు కల్యాణ్ రామ్, కేవలం హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఆయన ఫెయిల్యూర్స్‌ను తీసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ఇచ్చిన మాట తప్పడు అనే పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చిత్రాలలో 7 సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. కేవలం మూడు సినిమాలు విజయం సాధించాయి. 11 సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. ప్రస్తుతం దేవర చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే హీరోగా సినిమాలు తీస్తున్నారు. ఏదేమైనా మరిన్ని సినిమాలు తీసి మంచి విజాయాన్ని సాధించాలని కోరుకుందాం.