Reading Time: < 1 min

Dhoom Dham Movie Third Single Launched – Tel

ధూం ధాం సినిమా నుంచి థర్డ్ సింగిల్ టమాటో బుగ్గల పిల్ల.. లిరికల్ సాంగ్ విడుదల

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధూం ధాం. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ధూం ధాం సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ధూం ధాం సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మల్లెపూల టాక్సీ.., మాయా సుందరి.. పాటలు పాట ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ రోజు థర్డ్ సింగిల్ టమాటో బుగ్గల పిల్ల.. లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీకృష్ణ, గీతా మాధురి ఆకట్టుకునేలా పాడారు. ఎట్టెట్టగున్నా నువ్వు భల్లేగుంటావే…ఏ మాయో చేసి నన్ను గిల్లేస్తుంటావే..బంగారం గానీ తిన్నావా నువ్వు బబ్లీగా ముద్దొస్తుంటావే..బంగాళాఖాతం చెల్లెల్లా నన్ను అందంతో ముంచెస్తుంటావే..టమాటో బుగ్గల పిల్ల.. అంటూ సాగుతుందీ పాట. కలర్ ఫుల్ డ్యూయెట్ గా టమాటో బుగ్గల పిల్ల.. పాటను రూపొందించారు.

నటీనటులు :

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్ :

ఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ : గోపీ సుందర్
ప్రొడ్యూసర్ : ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ : సాయి కిషోర్ మచ్చా