Dilruba Movie Review
దిల్ రూబా మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
కిరణ్ అబ్బవరం నుంచి సినిమా వస్తుంది అంటే వైవిధ్యమైన కథే అని అందరి నమ్మకం. ఈ మధ్య రిలీజ్ అయి హిట్ కొట్టిన
క తరువాత వస్తున్న చిత్రం దిల్ రూబా. దీనికి సంబంధించిన ట్రైలర్ లో కు కూడా మంచి స్పందన వచ్చింది. పాటలు, ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
సిద్ధు(కిరణ్ అబ్బవరం) తండ్రి తన స్నేహితుడి చేతిలో మోసపోతాడు. దాన్ని తట్టుకోలేక మరణిస్తారు. తన స్నేహితుడు కూతురు మ్యాగీ (క్యాథీ డెవిసన్)తో సిద్దు ప్రేమ కూడా బ్రేక్ అవుతుంది. దాంతో సారీ, థ్యాంక్స్ అనే మాటల్న ఎప్పుడూ వాడొద్దు అనే సిద్దాంతం పెట్టుకుంటాడు. బ్రేక్ ప్ తో బాధపడుతుంటాడు. వీటి నుంచి బయటపడాలంటే ఊరు మారాలి అని సిద్దు అమ్మ చెప్పడంతో మంగుళూరుకు వెళ్తాడు. అక్కడ అంజలి (రుక్సర్ థిల్లాన్) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. సిద్ధుకు ఉన్న ముక్కుసూటితనంతో కాలేజీలో గొడవలు జరుగుతాయి. అలాంటి ఒక చిన్న గొడవ వల్ల వీళ్లిద్దరికి బ్రేక్ అప్ అవుతుంది. వీళ్లిద్దర్ని కలిపేందుకు సిద్ధు ఎక్స్ మ్యాగీ అమెరికా నుంచి ఇండియాకు వస్తుంది. సిద్ధు – అంజలికి మధ్య గొడవేంటి? సిద్దు ఎందుకు సారీ చెప్పడు. వీరిని కలిపేందుకు మ్యాగీ ఏం చేసింది.? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దిల్ రూబా సినిమా హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆధారం చేసుకుని రాసుకున్న కథ. సారీ, థ్యాంక్స్ అనే పదాలకు చాలా విలువ ఉంది అనే పాయింట్ చెప్పారు. ఆ రెండు పదాలను చెప్పకూడదు అనే వైకరి కలిగిన సిద్దు జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది ఫస్ట్ ఆఫ్ అంతా చూపించారు. ఈ పాయింట్ అందర్నీ ఆకర్షించేదే కానీ రాసుకున్న సీన్స్ చాలా తేలికగా ఉంటాయి. ఈ సీన్లతో ప్రేక్షకులు కనెక్ట్ అవలేరు. ముఖ్యంగా హీరో ఫ్లాష్ బ్యాక్ పెద్దగా ఆకట్టుకోదు. అలాగే సారీ, థ్యాంక్స్ ఎందుకు చెప్పకూడదో అనే తీరీ కూడా పెద్దగా ఆకట్టుకోదు. సిినిమా ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఆ తరువాత వచ్చే సన్నివేశాలు రొటీన్ ఫార్మెట్ లో వెళ్తాయి. కొన్ని సీన్లు చాలా అసహజంగా అనిపిస్తాయి.
ఇక సెకండ్ హాఫ్ లో సిద్దు ఎక్స్ లవర్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సిద్దును, అంజలిని కలిపేందుకు మ్యాగీ చేసే ప్రయత్నాలు పెద్దగా అలరించవు. దీనికి తోడు సత్య చేసే కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. అలాగే సెకండాఫ్‌లో సడన్ ఎంట్రీ ఇచ్చే జోకర్ పాత్రకు హీరోకు ఏర్పడే సంఘర్షణ అంతా ఇరికించినట్లు అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక సినిమాను చాలా రెగ్యూలర్ గా ముగించారు.
నటీనటులు:
సిద్దు పాత్రలో కిరణ్ అబ్బవరం ఒదిగిపోయాడు. బ్రేక్ అప్ సీన్స్, ఫైట్స్, లవ్ సీన్స్ లలో చాలా బాగా చేశారు. హీరోయిన్ రుక్సర్ చాలా ఎనర్టిటిక్ గా యాక్ట్ చేసింది. అలాగే గ్లామర్ గా కనిపించింది. క్యాథీ డెవిసన్ పాత్ర కొంచెమే ఉన్నా పరువాలేదు అనిపించింది.. సత్యను సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. మిగితా నటీనటలంతా వారి పాత్రల మేరకు అలరించారు. చ
సాంకేతిక అంశాలు:
దర్శకుడు విశ్వక్ అరుణ్ కథను చాలా చక్కగా నడిపించారు. ఇంకాస్త ఎంటర్ టైనింగ్ గా నడిపిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో కొంచెం లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. సామ్ సీఎస్ మ్యూజిక్ బాగుంది. పాటలతో పాటు బీజీఎం కూడా అలరించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
కిరణ్ అబ్బవరం
కథ
మైనస్ పాయింట్
కథనం
నిడివి
అంతిమతీర్పు
కమర్షియల్ హంగులు అన్ని ఉన్నాయి. కానీ చిన్న వెలతి అయితే ఉంటుంది.
Movie Details :
Movie Title : Dilruba
Banners :- Sivam Celluloids,Yoodle Film
Release Date :-14-03-2025
Censor Rating : “UA16+”
Written and Directed By: Viswa Karun
Cast: Kiran Abbavaram, Rukshar Dhillon, Kathy Davison
Music: Sam CS
Cinematography : Viswas Daniel
Editor: Praveen KL
Produced By: Ravi, Jojo Jose
Nizam Distributor : Mythri Movie Distributors LLP
Runtime : 152 minutes