Reading Time: 2 mins

Director Manoj Palleti Interview

 

దర్శకుడు మనోజ్ పల్లేటి ఇంటర్వ్యూ

 

“వీక్షణం” సినిమా సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ – దర్శకుడు మనోజ్ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”.  ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు. దర్శకుడు మనోజ్ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి

దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ – నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను. ఒకరోజు విక్టరీ వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం అని ఆయన అన్నారు. వెంకటేష్ గారు చెప్పిన ఆ మాటే ఈ సినిమా లైన్ కు మూలం. అక్కడి నుంచి వీక్షణం సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ వచ్చాం. స్క్రిప్ట్ రెడీ అయ్యాక కొంతమంది ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లాను. స్క్రిప్ట్ బాగుందని వారు చెప్పినా కొత్త దర్శకుడు ఎలా తీస్తారో అని డౌట్ పడ్డారు. నేను ఎక్కువమందిని కలిసినా కొద్దీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ బాగుందని అనడం నా కాన్ఫిడెన్స్ పెంచింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న ప్రొడ్యూసర్స్ నా కథ బాగుందని అంటున్నారంటే ఇందులో కంటెంట్ ఉంది అనిపించింది. మాది తాడిపత్రి. ఊరికి వెళ్లి ప్రొడక్షన్ గురించి ట్రై చేద్దామని అనుకున్నాను. అలా పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి, మేము కలిసి ఈ మూవీ స్టార్ట్ చేశాం. కామెడీ మిస్టిక్ థ్రిల్లర్ తరహాలో వీక్షణం సినిమా సాగుతుంది. నేను గతంలో జార్జ్ రెడ్డి, జోహార్ వంటి చిత్రాలకు పనిచేశాను. హారర్ కామెడీస్ మీరంతా చూసి ఉంటారు కానీ కామెడీ థ్రిల్లర్ అనేది కొత్తగా ఉంటుంది. థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వు తెప్పించడం మా సినిమా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాకు కొత్త విషయాలు నేర్చుకుంటాం. వీక్షణం సినిమా మేకింగ్ టైమ్ లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. నేను మా మూవీ ప్రచార కార్యక్రమాల్లో చెప్పినట్లు మా టీమ్ అంతా ప్రతి ఒక్కరం ఈ సినిమా కోసం కష్టపడి పనిచేయలేదు ఇష్టపడి పనిచేశాం. ఈ కథలో రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. అయితే వాటికి ఫిక్షన్ జోడించి సినిమాను రూపొందించాను. సంగీత దర్శకుడి కోసం చూస్తున్నప్పుడు సమర్థ్ ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబ్ లో చూసి ఈ కథ చెప్పాను. చెప్పగానే ఆయన ఎగ్జైట్ అయ్యి మా టీమ్ లో జాయిన్ అవుతానని చెప్పారు. మా మూవీ మూడ్ ను తన మ్యూజిక్ తో సమర్థ్ బాగా క్యారీ అయ్యేలా చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. మా సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే అవి ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండవు. అందుకే మా మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్రిల్లర్స్ అనేవి యూనివర్సల్ కాన్సెప్ట్స్. వీక్షణం లాంటి సినిమాలను భాషలకు అతీతంగా ఎవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మనం ఓటీటీలో ఏ భాషలో సినిమా అయినా చూసి ఆనందిస్తాం. కంటెంట్ బాగుండాలి..అదొక్కటే ముఖ్యం. ఆ కంటెంట్ మా వీక్షణం మూవీలో ఉంది. మా మూవీని థియేటర్ లోనే బాగా ఎంజాయ్ చేస్తారు. టెక్నికల్ గా క్వాలిటీగా ఉంటుంది. వీక్షణం థియేట్రికల్ ఎక్సీపిరియ్స్ ది బెస్ట్ గా ఉంటుంది. సంతోషంగా లైఫ్ లీడ్ సాగిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది అనేది మా మూవీ కాన్సెప్ట్. వీక్షణం సినిమా మెయిన్ లీడ్ ఆర్టిస్టులు అందరికీ పేరు తెస్తుంది. హీరోతో పాటు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ థియేటర్ లో చేసే సందడి మామూలుగా ఉండదు. కొత్త ఆర్టిస్టులను చూసిన ఫీల్ రాదు. కొత్త డైరెక్టర్ గారు చేసినట్లు లేదు అని నాతో సినిమా చూసిన వాళ్లు చెప్పారు. కొన్ని స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో నా నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తాం. అన్నారు.