Reading Time: 2 mins

Diwali Festival Upcoming Movies
దీపావళి పండగకు వచ్చే సినిమాలు

పండుగ వచ్చిందంటే అందరిలో సందడి మొదలౌతుంది. సినిమా ప్రేమికులకు సైతం కొత్త చిత్రాలు వస్తాయన్న సంబరం ఉంటుంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా దీపావళి కానుకగా సినిమాలు విడుదలవుతున్నాయి. కుటుంబం అంతా కలిసి ఉండే పర్వదినాన పూజలు, ప్రసాదాలు అయిపోయాక అలా సరదాగా ఓ మంచి సినిమాకు వెళ్లాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. అందుకనే మన దర్శక-నిర్మాతలు పండుగలకు కచ్చితంగా సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. మరీ ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించే సినిమాలు ఏంటో చూద్దాం.


టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం క. యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ సుజిత్-సంధీప్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీ, సప్సెన్స్ కథతో చాలా ఆసక్తిగా కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సారిక, తన్వీ రామ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకే చీకటిపడే కృష్ణగిరి అనే ఊరు. ఆ ఊరిలోకి కొత్తగా వచ్చిన పోస్టుమెన్ వాసుదేవ్ కు ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి. వాటి పర్యవసానాలు ఏంటి అనేది క సినిమా కథ. ప్రచార చిత్రాలతో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలుగజేస్తున్నారు చిత్ర బృంధం. తెలుగులోనే కాదు ఏ భాషాలో కూడా ఇలాంటి పాయింట్ చెప్పలేదు అంటూ.. ఈ సినిమా కచ్చితంగా అందరిని ఆకర్షిస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 31న విడుదల అవుతున్న ఈ చిత్రం ఏ మేరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా ఆయన సరసన మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు. నెలకు రూ. 6 వేలు సంపాదించే భాస్కర్ కోటిశ్వరుడు ఎలా అయ్యాడు అనే ఆసక్తికరమైన పాయింట్ తో ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల అవుతుంది. హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలపై తెలుగు ప్రేక్షకులకు మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఇది వరకు ఆయన నుంచి వచ్చిన చిత్రాలన్ని మంచి సబ్జెక్ట్ తో కూడుకున్నవే కావడం, మ్యూజిక్ అల్బమ్స్ కూడా ఫర్ఫెక్ట్ గా ఉండడంతో మనవారికి ఆయన సినిమాలపై మంచి ఓపినీయన్ ఏర్పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు దర్శకత్వం చేయడంతో సినిమాపై అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

అమరన్
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ముకుంద్ రవదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమరన్. మేజర్ గా హీరో శివకార్తికేయన్, ఆయన భార్య ఇందూ రెబెకా వర్గీస్ గా సాయి పల్లవి నటించారు. కమలహాసన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు రూ.150 కోట్లతో ఈ చిత్రాన్ని రూపోందించారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టొబర్ 31న విడుదల అవతుంది. దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

వీటితోపాటు బఘీర కన్నడ సినిమా విడుదలౌతుంది. ప్రశాంత్ నీల్ అందించిన కథతో శ్రీమురళి, రుక్ముణీ వసంత్ జంటగా నటిస్తున్నారు. ఇది సూపర్ మ్యాన్ లాంటి సినిమా.

బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం సింగం ఎగైన్ సైతం 31న విడుదల అవుతుంది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్, కరీనా కపూర్, దీపిక పడుకునే లాంటి దిగ్గజాలు నటించిన సింగం పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ దీపావళికి విడుదలౌతున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.