Reading Time: 2 mins

Double Ismart Movie Review – Tel

డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

 

స్టోరీ లైన్ :

బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మూడు నెలల్లో చనిపోతానని తెలుసుకున్న బిగ్ బుల్ (సంజయ్ దత్)   తన బ్రెయిన్ మెమరీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుని .. ఆల్రెడీ హైద్రాబాద్ లో బ్రెయిన్ లో యు.ఎస్.బి పోర్ట్ పెట్టుకొని బ్రతుకుతున్న ఇస్మార్ట్ శంకర్ (రామ్) గురించి తెలుసుకొంటాడు. తన బ్రెయిన్ ను శంకర్ బుర్రలోకి ట్రాన్స్ఫర్ చేసి తన భవిష్యత్ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో శంకర్ & బిగ్ బుల్ నడుమ ఏం జరిగింది? ED ఆఫీసర్ అయినా జన్నత్(కావ్య థాపర్) తో లవ్ లో పడినా శంకర్ తన ప్రేమని గెలిచాడా? తన తల్లి ని చంపినా బిగ్ బుల్ ని శంకర్ ఏమి చేసాడు ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలిసిస్:

తన తల్లిని చంపినా విలన్ బ్రెయిన్ మెమరీ హీరో కి ట్రాన్స్ఫర్ అయితే..హీరో రెండు బ్రెయిన్స్ తో రివెంజ్ తీర్చుకోవడం.

ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్ :

డబుల్ ఇస్మార్ట్ గా రామ్ పోతినేని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని యాస వరకు ప్రతి విషయంలో ఓల్డ్ సిటీ ప్రతిధ్వనిస్తుంది. ఇక డ్యాన్స్ & ఫైట్స్ తో అయితే మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు.. కావ్య థాపర్ చాలా అందంగా ఉంది.  డ్యాన్సుల విషయంలోనూ రామ్ ఈజ్ ను మ్యాచ్ చేసింది. ఇన్నాళ్ల కెరీర్లో ఆమెకు బహుశా ఇదే మంచి హిట్ అని చెప్పాలి.

సంజయ్ దత్  ఈ సినిమాలో బిగ్ బుల్ గా స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. తల్లి పాత్రలో నిడివి చిన్నదే అయినా నటి ఝాన్సీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. గెటప్ శ్రీను , సయాజీ షిండే తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.

టెక్నికల్ గా:

పూరి జగన్నాథ్ తనదైన శైలి డైలాగులతో మాత్రం ఎప్పట్లానే మ్యాజిక్ చేశాడు. సింపుల్ కాన్సెప్ట్ ను మరీ ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా.. మదర్ సెంటిమెంట్ ను సరిగ్గా వాడుకోని పక్కా కమర్షియల్ సినిమాను అందించాడు. మణిశర్మ డబుల్ ఇంపాక్ట్ మ్యూజిక్ తో అలరించాడు. ప్రతి ఒక్క పాట ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది.అలాగే.. నేపథ్య సంగీతం కూడా బాగుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది.

చూడొచ్చా:

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్:

రామ్ నటన

కావ్య థాపర్ అందం,

సంజయ్ దత్

స్టోరీ లైన్

మైనస్ పాయింట్స్:

అలీ సీన్స్

తీర్పు:

శంకర్ డబల్ ఇస్మార్ట్ గా అలరించాడు..

నటినటులు:

రామ్ పోతినేని ,కావ్య థాపర్, సంజయ్ దత్ , సాయాజీ షిండే, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్‌పాండే, ఝాన్సీ,ఆలీ ,తదితరులు

సాంకేతిక వర్గం:

సినిమా టైటిల్: డబుల్ ఇస్మార్ట్

బ్యానర్ : Puri Conceptts

విడుదల తేదీ :15-08-24

సెన్సార్ రేటింగ్: A

దర్శకత్వం:పూరి జగన్నాధ్

నిర్మాత: ఛార్మీ కౌర్, పూరి జగన్నాధ్

సంగీతం:మణి శర్మ

సినిమాటోగ్రఫీ:శ్యామ్ కె.నాయుడు

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

రన్ టైం : 2 hr 36 min

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్