Eleven Movie 16th May Worldwide Release
లెవెన్ చిత్రం మే 16 వరల్డ్ వైడ్ రిలీజ్
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వేసవిలో మే 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఒక ఇంటెన్స్ కథనాన్ని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర, శశాంక్, ఆడుకలం నరేన్ పోలీసులుగా, ముసుగు ధరించిన వ్యక్తిగా ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ చాలా క్యురియాసిటీని పెంచుతోంది.
సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్‌లో నటించిన రేయా హరి, ఎలెవెన్‌లో కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు వంటి ప్రతిభావంతులైన తారాగణం కీలక పాత్రల్లో నటించించారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ సంగీతం అందించగా, కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి. ఎడిటర్‌గా వ్యవహరించడం, ఈ చిత్రం సాంకేతిక నైపుణ్యాన్ని మరింత పెంచుతుంది.
ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానున్నందున, నిర్మాతలు ప్రమోషన్స్ దూకుడు పెంచబోతున్నారు