Reading Time: 2 mins

Fauja Movie Received 3 National Awards

 

ఫౌజా మూవీ కి మూడు జాతీయ అవార్డులు

సినిమాకి భాషా సరిహద్దులు ఉండవు.. ‘ఫౌజా’ ప్రత్యేక ప్రదర్శనలో హీరో కార్తీక్ ద‌మ్ము
అజిత్ దాల్మియా నిర్మాణంలో ప్రమోద్ కుమార్ తెరకెక్కించిన ‘ఫౌజా’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ దమ్ము, ఐశ్వర్యా సింగ్, పవన్ మల్హోత్ర ప్రధాన పాత్రల్లో రాహి ప్రొడక్షన్స్ అండ్, పీకే ప్రొడక్షన్ సమర్పణలో వచ్చిన ‘ఫౌజా’ హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు రాబోతోన్నారు. ఈ మూవీని హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలోచిత్ర క‌థానాయ‌కుడు కార్తీక్ ద‌మ్ము, హీరో విజ‌య్ ధరన్  దాట్ల‌, ఏపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ దమ్ము మురళీ మోహన్, హర్యాన ప్రిన్సిపల్ సెక్రటరీ డా. డి. సురేష్, శ్రీమతి కాంతి డి. సురేష్ ముఖ్య అతిథులుగా శనివారం నాడు ఫౌజా సినిమాను ప్రదర్శించారు. అనంతరం ఈ కార్యక్రమంలో..

హీరో కార్తీక్ దమ్ము మాట్లాడుతూ
.. ‘నేను హైద్రాబాద్‌లో పుట్టాను. మళ్లీ ఇలా నా సినిమా కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. సినిమాకి భాషా సరిహద్దులు ఉండవు. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి చిత్రానికి భాషతో సంబంధం ఉండదు. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లోకి ఈ చిత్రం రానుంది. అందరూ మా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

విజ‌య్ ధరన్  దాట్ల‌ మాట్లాడుతూ ‘‘‘ఫౌజా’ ఎప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్ మూవీ. ఈ సినిమాకు మూడు నేష‌న‌ల్ అవార్డ్స్ వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే దీన్ని తెలుగులో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. కార్తీక్, అజిత్ దాల్మియా, ప్ర‌మోద్ కుమార్ స‌హా ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌’’ అన్నారు.

చిత్ర నిర్మాత అజిత్ దాల్మియా మాట్లాడుతూ.. ‘మా ఫౌజా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘డబ్బులు ఎన్ని ఉన్నా కూడా బ్రాండెండ్ బట్టల్ని కొనగలం.. కానీ ఇండియన్ ఆర్మీ యూనిఫాంని మాత్రం కొనలేం.. దాన్ని కష్టంతో, ఇష్టంతో సాధించుకోవాలి.. దేశ భక్తి ఉంటేనే అది మన సొంతం అవుతుంది. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి ఫౌజా నచ్చుతుంది. త్వరలోనే మా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు.

హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ డా. డి. సురేష్ మాట్లాడుతూ.. ‘చిన్న బడ్జెట్‌తో ఎంతో ప్యాషన్‌తో తీసిన ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇది చాలా పెద్ద విషయం. ఇంత మంచి చిత్రాన్ని ఇప్పుడు తెలుగు, తమిళ్‌లోకి తీసుకు వస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

కాంతి డి. సురేష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని చూసినప్పుడు అందరూ ఏడ్చారు. అసలు సినిమాకు భాష అనేది అడ్డంకి కాదు. మూవీకి భాష, జాతి, దేశం, ప్రాంతం అనేది ఉండదు. సినిమాలు, ఆటలకు ఎమోషన్స్ ముఖ్యం. వీటికి భాష అనేది సమస్య కాదు. కార్తిక్ అందుకే మా ఉమెన్స్ కబడ్డీ లీగ్ద‌కు సపోర్ట్‌గా నిలిచారు. ఫౌజా చిత్రాన్ని మళ్లీ అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

న‌టీన‌టులు:

కార్తీక్ ద‌మ్ము, ప‌వ‌న్ మ‌ల్హోత్రా, ఐశ్వ‌ర్య సింగ్, జోగి మ‌ల్లాంగ్‌, హ‌రి ఓం కౌశిక్‌, న‌వీన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌:  రాహి ప్రొడక్షన్స్ అండ్, పీకే ప్రొడక్షన్
నిర్మాత‌లు: అజిత్ దాల్మియా
ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌మోద్ కుమార్ పున్హానా
మ్యూజిక్‌:  యుగ్ భూష‌ల్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: స‌ంకేత్ సానే
సినిమాటోగ్ర‌ఫీ: శ‌శాంక్ విరాగ్‌
ఎడిట‌ర్‌:  జితేంద్ర దొంగ్రే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వికాస్ బెర్వాల్‌
ప్రొడ‌క్ష‌న్ హెడ్‌:  కుల్దీప్ సింగ్