Reading Time: < 1 min

First Lady Telugu Producer Krishna Veni Journey
తెలుగు మొదటి మహిళ ప్రొడ్యూసర్ కృష్ణవేణి ప్రయాణం

తొలితరం తెలుగు మహిళ నిర్మాత సి. కృష్ణవేణి ప్రయాణం ఎందరికో స్పూర్తిదాయకం. ఆమె కేవలం ప్రొడ్యూసర్ గానే కాకుండా మంచి నటీ, గాయకురాలు కూడా. సీనియర్ ఎన్టీఆర్ కు తొలి అవకాశం ఇచ్చి వెండితెరకు పరిచయం చేశారు. 1924లో వెస్ట్ గోదావరి జిల్లాలోని పంగిడి గ్రామంలో జన్మించిన కృష్ణవేణి చిన్ననాటి నుంచి నాటకాలలో నటించేది. ఆ విషయం దర్శకుడు సి. పుల్లయ్యకు తెలిసి తన నటనకు మెచ్చుకొని అనసూయ అనే సినిమాలో టైటిల్ రోల్ ఇచ్చారు. ఆ తరువాత కొన్ని సినిమాలో బాలనటిగా నటించారు. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజాతో పరిచయం ప్రేమగా మారి ఇధ్దరు 1940లో పెళ్లి చేసుకున్నారు.

కృష్ణవేణికి బాగా పేరు తెచ్చిన సినిమాల్లో గొల్లభామ, లక్ష్మమ్మ చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తరువాత నిర్మాతగా మారి ఇద్దరు హీరోలను తెరమీదకు పరిచయం చేశారు. అందులో మనదేశం చిత్రంతో ఎన్టీఆర్ ను, దాంపత్యం సినిమాతో విజయ్ కుమార్ ను పరిచయం చేశారు. అలాగే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఘంటసాలను లక్ష్మమ్మ సినిమాకు సంగీతదర్శకుడిగా పరిచయం చేయగా, దాంపత్యం సినిమాకు రమేష్ నాయుడిని పరిచయం చేశారు. పీ. లీల, ఎర్రా అప్పరావు ఇద్దరు గాయకులతో పాటు నటీ లక్ష్మీకాంతను వెండి తెరకు పరిచయం చేశారు.

నటిగా కృష్ణవేణి చివరి సినిమా సహసం. నిర్మాతగా చివరి సినిమా 1957లో నిర్మించిన దాంపత్యం. చిత్రసీమకు తాను అందించిన సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. అలాగే 2021 సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలలో భాగంగా లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డును ఆమె పొందారు. చివరి వరకు సినిమాలే ఊపిరిగా బతికిన కృష్ణవేణి ఫిబ్రవరి 16న తదిశ్వాస విడిచారు. ఆమె తరువాత తరం అయిన తన కూతురు ఆరాధ్య సైతం నిర్మాతగానే ఉన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమలో సినిమాలను నిర్మిస్తున్నారు.