Flop Pan India Telugu Movies of 2024 Releases
నిరాశ పరిచిన తెలుగు పాన్ ఇండియా చిత్రాలు
పాన్ ఇండియా చిత్రాల పరంపర కొనసాగుతున్న తరుణంలో అన్ని భాషల్లో తెరకెక్కుతున్న చిత్రాలలో ఎక్కువ శాతం పాన్ ఇండియా ట్యాగ్ తో రూపొందుతున్నాయి. అలా రూపొందిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేయగా, మరికొన్ని చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడి నిర్మాతలకు నిరాశను మిగిలిస్తున్నాయి. ఈ సందర్భంగా 2024లో విడుదలైన పాన్ ఇండియా చిత్రాలలో థియేటర్ల వద్ద పరాజయం పొందిన చిత్రాలు ఏవో చూద్దాం..
ఇతర పరిశ్రమలతో పోలిస్తే తెలుగు పరిశ్రమలోనే ఎక్కువ పాన్ ఇండియా చిత్రాలు నిర్మాణం జరుగుతుంది. అలాగే సక్సెస్ రేట్ లో కూడా తెలుగు చిత్రాలే ఎక్కువ విజయాన్ని సాధిస్తున్నాయి. తాజాగా విడుదలైన పుష్ప ది రూల్ మూవీ ఇప్పటికే రూ.1300 కోట్ల మార్కు దాటి 2000 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. ఒక వైపు భారీ విజయాలను నమోదు చేస్తుంటే మరో వైపు డిజాస్టర్లు అవుతన్న సినిమాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు వెండితెరపై ప్రేక్షకులకు కనెక్టు కానీ సినిమాలలో రవితేజ నటించిన ఈగల్ సినిమా ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రవితేజ నటించిన ఈగల్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో నవదీప్, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు నటించారు. దాదాపు 35 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఆశించిన ఫలితాన్ని రాబట్ట లేకపోయింది. అక్రమ ఆయుధాల వలన ఎలాంటి అసాంఘీక చర్యలు జరుగుతాయి, వాటి వలన సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈగల్ సినిమా ప్రేక్షకులను రంజింప చేయలేదు.
పాన్ నుండి సినిమాగా వచ్చి నిరాశపరచిన మరో సినిమా ఆపరేషన్ వాలెంటైన్, వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ హీరోహీరోయిన్లుగా నటించారు. యాక్షన్ డ్రామాగా ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ స్టన్స్ తో, పుల్వామా ఎటాక్, బాల్కోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.
పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజ్ లలో విడుదలైంది. ఈ సినిమాతో ఆడియోన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు.
వరుణ్ తేజ్ నటించిన మట్కా చిత్రం పాన్ ఇండియా లాంగ్వేజ్ లో విడుదలైంది. మట్కా అనే గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సైతం ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు. కరుణ కుమార్ ఈ సినిమాను 90వ దశాబ్దంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను రాసుకొని తెరకెక్కించారు.
ఇవి మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోల పాన్ ఇండియా చిత్రాలు సైతం థియేటర్స్ వద్ద మెప్పించలేకపోయాయి. అందులో కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రాన్ని శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ చిత్రం పరాజయం పాలయింది. అలాగే విజయ్ దళపతి నటించిన గ్రేట్ అఫ్ ఆల్ టైం, సూర్య నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ కంగువా సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.