Reading Time: < 1 min

French actor praises on Ram Charan-Tel

రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్ నటుడు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌పై ఓ ఫ్రెంచ్ నటుడు ప్రశంసల వర్షం కురిపించారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాచ్ చరణ్ సీతారామరాజు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆయన నటనకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయన నటనను మెచ్చుకున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన పిరియాడికల్ మల్టీస్టారర్ కథతో రాజమౌళి అద్భుతాన్ని చిత్రీకరించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పోటీపడి నటించారు. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 2022 లో విడుదలైంది. ముందు పాన్ ఇండియాను షేక్ చేస్తుంది అని భావించారు కానీ ఎవరు ఊహించని విధంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనాలు సృష్టంచిన సంగతి తెలిసిందే.

తాజాగా ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో రామ్ చరణ్‌ను మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ” ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన విపరీతంగా నచ్చింది. ఆయన ఎంట్రీ సీన్ అద్భుతం. డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశారు. అంటూ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ చిత్రం సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ. 1300 కోట్లు సంపాదించింది. విదేశి భాషాల్లో విడుదలైంది. ప్రముఖ అవార్డు ఆస్కార్‌ను సైతం గెలుచుకొని తెలుగు సినిమా సత్తాను చాటింది.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాఫ్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ, అంజలి నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తరువాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్సీ17 చిత్రం చేయబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాఫ్‌లో ఈ చిత్రం ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.