Reading Time: 2 mins

Game Changer And Most Awaited Movies in 2025
గేమ్ ఛేంజర్ తో పాటు విడుదల అవుతున్న 2025 చిత్రాలు

నూతన సంవత్సరం వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా భారీ బడ్జెట్ తో పాటు చిన్న, మధ్యతరహా సినిమాలు విడుదలకు ముస్తాబు అవుతున్నాయి. వీటిలో మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమాలేంటి అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉండే సినిమాలు ఏంటనేది ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతుంది. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలయ్యే సినిమాలు, ఆ తర్వాత వచ్చే తెలుగు సంవత్సరాది ఉగాది రోజున విడుదలయ్యే సినిమాలతో పాటు 2025లో ఎన్ని పాపులర్ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయో తెలుసుకుందాం.

కొత్త సంవత్సరంలో సంక్రాంతి సినిమాల నుంచే సందడి మొదలౌతోంది. మోస్ట్ ఎవైటింగ్ మూవీస్ లిస్టులో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేజర్ మూవీ ఉంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికే చిరంజీవి, సుకుమార్ లాంటి ప్రముఖులు సినిమా చాలా బాగుంది అనే రివ్యూస్ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అవబోతున్న గేమ్ చేంజర్ చిత్రం ఎలా ఉంటుందో అనే ఉత్సాహం అందరిలో ఉంది.

ఎప్పటిలాగే ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ డాకూ మహారాజ్ చిత్రంతో వస్తున్నారు, బాబి కొల్లీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా వస్తున్న మరో బడా హీరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావు పూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న మూడోవది చిత్రం ఇది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ముస్తాబ్ అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

2025లో పవన్ కళ్యాణ్ నుంచి రెండు చిత్రాలు వచ్చే అవకాశం ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ సంవత్సరం మార్చ్ 28 కి వచ్చే అవకాశం ఉంది. అలాగే సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ కూడా ఇదే సంవత్సరం థియేటర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ 2 ఈ సంవత్సరమే విడుదల అయ్యే అవకాశం ఉంది. అలాగే మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ చిత్రం కూడా 2025లో రిలీజ్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వాంభర ఇదే సంవత్సరం సందడి చేయబోతుంది. అలాగే విజయ్ దేవరకొండ నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ ఫిబ్రవరి 7న వస్తుండగా, మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన లైలా చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల అవబోతుంది. అలాగే అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటి సినిమా, శేఖర్ కమ్లము దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటిస్తున్న కుబేర, నాని హీరోగా నటిస్తున్న హిట్ 3, కాంతారావు చాప్టర్ 1, మిరాయి, రెట్రో, తగ్ లైఫ్ చిత్రాలు ఈ సంవత్సరమే విడుదలకు సిద్ధం అవుతున్నాయి.