Game Changer Hero Ram Charan In Unstoppable Show
గేమ్ ఛేంజర్ హీరో రామ్ చరణ్ బాలయ్యతో అన్ స్టాపబల్ హంగామా
నందమూరి బాలకృష్ణ సినిమాల ద్వారా ఎంత పాపులర్ అయ్యారో అన్ స్టాపబుల్ షో ద్వారా అంతే పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈ టాక్ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా మంచి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ సీజన్ 4లో చాలా మంది స్టార్ నటీనటులు వస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా హీరో రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ షో అన్నపూర్ణలో షూటింగ్ జరుపుకుంటుంది.
అన్‌స్టాపబుల్ సెట్‌లో రామ్ చరణ్ సందడి చేస్తున్నారు. దిల్ రాజ్ నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం ప్రమోషన్ లు వేగవంతం చేశారు. దానిలో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు చరణ్. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి కానుకగా బాలయ్య, చరణ్, వెంకటేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య డాకూ మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాము అనే సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మరీ ఈ సినిమాల్లో ఏ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.