Reading Time: 2 mins

Game Changer Hero Ram Charan reveals fatherhood secrets
అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బికె సీజన్ 4 లో ఫాదర్ హుడ్ సీక్రెట్స్ ని రివిల్ చేసిన రామ్ చరణ్

హైదరాబాద్, జనవరి 5, 2025 – అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4 గ్లోబల్ సూపర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ఎపిసోడ్ ప్రేక్షకులను మరపురాని ప్రయాణంలో తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే అభిమానులలో సంచలనం సృష్టించింది, ఇది సీజన్‌లో హైలీ యాంటిసిపేటెడ్ ఎపిసోడ్‌లలో ఒకటిగా నిలిచింది.

సంక్రాంతి వేడుకల నేపధ్యంలో చిత్రీకరించబడిన ఈ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చింది. హోస్ట్ నందమూరి బాలకృష్ణ (NBK)తో ప్రోమో ప్రారంభమవుతుంది, ఈ ఎపిసోడ్ వారు ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నంగా ఉంది ప్రేక్షకులను కట్టిపడేసింది. NBK కూడా రామ్ చరణ్‌ను ‘మెగా ఫ్యామిలీ స్టార్’ అని ఆప్యాయంగా పిలవడం సరదా సంభాషణకు మరింత స్పెషల్ చేసింది.

ఎపిసోడ్ రామ్ చరణ్‌ పర్శనల్ మూమెంట్స్ ని రివిల్ చేసింది, 2025లో గ్రాండ్ సన్ కావాలనే కోరికను పంచుకున్న అమ్మమ్మ అంజనా దేవి, తల్లి సురేఖ కొణిదెల వీడియో సందేశం హత్తుకుంది.

తన కుమార్తె వీడియో రామ్ చరణ్‌ కు భావోద్వేగ క్షణాన్ని తీసుకువస్తుంది. ఆమె రాక తన జీవితంలో, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఎలా గొప్ప ఆశీర్వాదంగా ఉందో చూపింది.

రామ్ చరణ్ తన కుమార్తె అందమైన కథలు పంచుకుంటూ తండ్రిగా తన జీవితం గురించి, ఆమె ఇప్పటికే అతనిని తన కాలి మీద ఎలా ఉంచుతోందో తెలియజేసారు. ఆమెకు తినిపించడం నుండి పరిగెత్తడం వరకు, చరణ్ తన మధురమైన క్షణాలు పంచుకున్నారు. తన కూతురి ముఖాన్ని ఎప్పుడు రివల్ చేయాలనుకుంటున్నాడో అని NBK అడిగినప్పుడు సంభాషణ సరదాగా మారుతుంది. “నాన్న” అని పిలిచినప్పుడు అని రామ్ చరణ్ చెప్పడం మనసుని హత్తుకుంది.

మరో స్పెషల్ సిగ్మేంట్ లో రామ్ చరణ్ తన హోం స్టార్‌ని పరిచయం చేశాడు-తన ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ కొణిదెల. పెంపుడు జంతువు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది, రామ్ చరణ్ తన భార్య ఉపాసన అప్సెట్ అయినప్పుడు రైమ్‌ని ఎలా పంపేవాడో సరదాగా పంచుకున్నారు.

రామ్ చరణ్ ప్రాణ స్నేహితుడు హీరో శర్వానంద్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కనిపించారు. ఈ ఎపిసోడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌తో హిలేరియస్ ఫోన్ కాల్ కూడా ఉంది, ఇది సంభాషణకు ఉత్తేజకరమైన ట్విస్ట్‌ను జోడిస్తుంది.

ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన, ఫన్నీ సీక్రెట్స్ రివిల్ చేశారు, ఇది ఎపిసోడ్‌లోని హైలైట్‌లలో ఒకటిగా ఉంటుందని హామీ ఇచ్చింది.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’లో చరణ్‌తో కొలబరేట్ అయిన నిర్మాత దిల్ రాజు ఎపిసోడ్ సందడి చేశారు. మరపురాని వినోదంతో నిండిన ఈ గ్రాండ్ ఎపిసోడ్‌ ని మిస్ అవ్వకండి. జనవరి 8, 2025న ఆహా OTTకి ట్యూన్ అవ్వండి.