Game Changer Movie Music Director Thaman Journey
గేమ్ ఛేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినీ ప్రస్థానం
తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో ఎస్ ఎస్ తమన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరడజన్ సినిమాలు విడుదల అవుతే అందుకే మూడు సినిమాలు ఆయనవే ఉంటున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు ముందుగా వినిపిస్తుంది. తమన్ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. చిన్నతనంలో డ్రమ్స్ ప్లేయర్ గా మొదలు పెట్టిన ఆయన ప్రస్థానం నేడు ఆయన ప్లే చేస్తున్న డ్రమ్స్ కు థియేటర్లు ఊగిపోతున్నాయి.
ఎస్ఎస్ తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. అందరికీ తమన్ గా సుపరిచితం. ఈయన కుటుంబం అంతా సినిమాలకు పరిచయం ఉన్నవారే. అయితే వీరి తాతా ఘంటసాల బాలరమయ్య మంచి దర్శకుడు, నిర్మాత. ఎన్నో సినిమాలను నిర్మించి చిత్రసీమకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. తరువాత తరంలో తమన్ వాళ్ల అమ్మ సావిత్రి ఒక గాయని. తండ్రి అశోక్ కుమార్ డ్రమ్స్ ప్లేయర్. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర డ్రమ్స్ వాయించేవారు. తమన్13 ఏళ్లకే తండ్రిని కోల్పోయిన తమన్ కుటుంబానికి అండగా ఉండేందుకు డ్రమ్స్ ప్లేయర్ గా కేరీర్ ప్రారంభించారు. ఆయన డ్రమ్స్ ప్లేయర్ గా రాజ్‌కోటి, మాధవపెద్ది, బాలసుబ్రమణ్యం, గంగై అమరన్, శివమణి వంటి సంగీత దర్శకుల దగ్గర పని చేశారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రంలో సిద్ధార్థ్ స్నేహితుడిగా డ్రమ్స్ వాయించే పాత్ర చేశాడు. ఇప్పుడు అదే శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పటికే విడుదలై పాటలు కూడా సినిమాపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ట్రైలర్ లో బీజీఎం కూడా చాలా బాగుంది. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉంటుందో అని అందరిలో ఉత్సుకత మొదలైంది. ముఖ్యంగా తమన్ అందించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం కానుంది.