Game Changer Movie Total Story in One Dialouge
గేమ్ ఛేంజర్ కథ మొత్తం ఒక్క డైలాగ్ లోనే ఉంది
స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ లో దర్శకుడు చాలా విషయాలను చెప్పారు. కొన్ని సవాళ్లను విసిరారు. స్టోరీ ఏంటి అనేది చెప్పకుండా ట్రైలర్ కట్ చేసిన విధానం అందరినీ సినిమాపై మరింత ఉత్సాహాన్ని పెంచింది. అయితే టైలర్ లో సినిమా స్టోరీ ఏంటి అనేది ఒక హింట్ ఇచ్చారు దర్శకుడు. అదే హీరో రామ్ చరణ్ చెప్పే డైలాగ్. “కడుపునిండా 100 ముద్దలు తినే ఏనుగుకు ఒక ముద్ద తక్కువైతే వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఆ ఒక్క ముద్ద లక్ష చీమలకు ఆహారం” ఈ ఒక్క డైలాగు ను ఢీకొట్ చేస్తే గేమ్ చేంజర్ కథ ఏంటో అర్థం అవుతుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రిభినయం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రిగా రామ్ చరణ్ ఒక పొలిటికల్ పార్టీని పెట్టి తన వెంటే ఉండే వారితో వెన్నుపోటుకు బలవడంతో ఆయన ప్రస్తావన ముగిస్తుంది. దాని తర్వాత యంగ్ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మళ్లీ తన తండ్రి పెట్టిన పార్టీని ఎలా బలోపేతం చేశాడు అనేది కూడా అంతర్లీనంగా ఉన్న సినిమా లైన్ అని అర్థమవుతుంది.
ముందు చెప్పుకున్నట్లు చీమల ఆహారం డైలాగు విషయానికి వస్తే.. ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి ఇండస్ట్రీలోనూ అవినీతిపరులు ఏనుగుల్లా మారిపోయారు. వారు అర్జించే అవినీతి సొమ్ము, లంచాలలో ఒక్క భాగం నిజాయితీగా వదిలేసిన లక్ష మంది అమాయక ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారు. వారి కనీస నిత్యావసరాలు తీరుతాయి అనే పాయింట్ తో ఆ డైలాగులు ముడిపెట్టారు దర్శకులు.
ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పుకుంటే కాలానుగుణంగా డైరెక్టర్ శంకర్ మారిపోయారు అనేదానికి ఈ డైలాగ్ చక్కటి ఉదాహరణ. మారిపోయారు అనే దానికన్నా అప్డేట్ అయ్యారు అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో శంకర్ తెరకెక్కించిన జెంటిల్మాన్, ఒకే ఒక్కడు, భారతీయుడు వంటి చిత్రాలలో లంచం, అవినీతి, సమాజాములో ఉన్న అసమానతులపైన ఆయన కాన్సెప్ట్ ఎప్పుడూ ఒకే రీతిలో ఉండేది, లంచం తీసుకోవడం ఇవ్వడము రెండు నెరమే, లంచం ఇవ్వకూడదు తీసుకొనివ్వను అని కథానాయకుడు పోరాటం చేసేవాడు. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో కాస్త అప్డేట్ అయ్యారు.. అన్యాయంగా తినేవాడు ఎలాగో మారడు కానీ ఆ తీవ్రత తగ్గిస్తే చాలామంది పేద ప్రజలు బతుకుతారు అనే కొత్త కాన్సెప్టును అందించే ప్రయత్నం చేస్తున్నారు గేమ్ చేంజెస్ సినిమాతో. అంతేకాకుండా ఈ సినిమాలో అన్ ప్రెడక్టబుల్ అనే డైలాగును నొక్కి మరీ చెబుతున్నారు అంటే సినిమాలో ఎవరు ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. మరికొద్ది రోజుల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ఆ ట్విస్ట్ ఏంటో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. చూడాలి మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో.