Reading Time: < 1 min

Game Changer Trailer Review

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రివ్యూ

స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ లో దర్శకుడు చాలా విషయాలను చెప్పారు. కొన్ని సవాళ్లను విసిరారు. స్టోరీ ఏంటి అనేది చెప్పకుండా ట్రైలర్ కట్ చేసిన విధానం అందరినీ సినిమాపై మరింత ఉత్సాహాన్ని పెంచింది. అయితే టైలర్ లో సినిమా స్టోరీ ఏంటి అనేది ఒక హింట్ ఇచ్చారు దర్శకుడు. అదే హీరో రామ్ చరణ్ చెప్పే డైలాగ్. “కడుపునిండా 100 ముద్దలు తినే ఏనుగుకు ఒక ముద్ద తక్కువైతే వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఆ ఒక్క ముద్ద లక్ష చీమలకు ఆహారం” ఈ ఒక్క డైలాగు ను ఢీకొట్ చేస్తే గేమ్ చేంజర్ కథ ఏంటో అర్థం అవుతుంది.

సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ పై చాలా ఆసక్తి కలుగుతుంది. ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలుసు అయితే ట్రైలర్ రామ్ చరణ్ మూడు నాలుగు గెటప్ లలో అలరించారు. ఫాదర్ గెటప్ లో ప్రజాపక్షం పార్టీ నాయకుడిగా కనిపించాడు. స్టూడెంట్ గా హ్యంగర్ మేనజ్ మెంట్ ఇష్యూస్ ఉన్నట్లు దాని నుంచి అదిగమించడానికి బాస్కెట్ బాల్ ఆటను ఎంచుకోవడం, తరువాత ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించారు. అంతే కాకుండా లుంగీ కట్టుకొని కత్తితో చాలా మాస్ లుక్ లో కనిపించారు. వీటింనింటిని లెక్కలు వేసుకొని చూస్తే.. సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చడానికి సిద్దం అయినట్లు కనిపిస్తుంది.

Director – S. Shankar

Producers – Raju, Shirish, Zee Studios

Tamil Producers: SVC – Adityaram

Writer – Vivek Story Line – Karthik Subbaraj

Co-Producer – Harshith

DOP – S Thirunavukkarasu

Music – Thaman S

Dialogues – Sai Madhav Burra (Telugu), Vivek (Tamil), Rajendra Sapre (Hindi)

Executive Producer: SK Zabeer