Reading Time: < 1 min

Good news for Chiranjeevi fans Vishwambhara teaser will be released on that day-Tel

చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ విశ్వంభర టీజర్ ఆరోజే

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా విశ్వంభర. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రాన్ని బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ మినహా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని నిరుత్సాహంలో ఉన్న ప్రేక్షకులకు.. మేకర్స్ ఆగస్టు నెలలో ఓ శుభవార్త ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. ప్రతీ సంవత్సరం ఆయన అభిమానులు ఎంతో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తారు. రక్తదానంతో మొదలుకొని కేక్ కటింగ్స్ వరకు ఇలా వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలు పెడుతారు. ఈ సంవత్సరం ఆయన బర్త్ డే ఇంకాస్త ప్రత్యేకం కానుంది. ఎందుకంటే ఆయన నటిస్తున్న విశ్వంభర చిత్రం డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.

అలాగే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న తరువాత ఇది ఆయన మొదటి పుట్టిన రోజు కావడం కూడా ఈ వేడుకకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సంతోష పర్వదిన సందర్భంగా మెగా అభిమానుల కోసం విశ్వంభర చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్టు 22 ఉదయం విశ్వంభర చిత్రం నుంచి టీజర్ విడుదల కాబోతుంది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు నిర్వహిస్తున్న సంస్థ సినిమా గురించి కాస్త లీక్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలుబడుతున్నాయి. విశ్వంభర హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉందని, ప్రతీ షాట్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుందని, ఇది చిరంజీవి అభిమానులకు పండుగ లాంటి సినిమా అనే ప్రచారం జరగుతోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహిత ఎమ్.ఎమ్ కిరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా అందాల భామ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటున్న విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భోళాశంకర్ చిత్రం నిరుత్సాహ పరిచిన విషయం తెలిసిందే. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్లాలనే యువ దర్శకుడితో విశ్వంభరకు శ్రీకారం చుట్టారు మెగాస్టార్. అలాగే ఆయన కూతురు సుస్మిత స్థాపించిన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కథ సెట్ కాకపోవడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది. మరీ ఈ ఆగస్టు 22న ఆ వార్తలకు మళ్లీ ఊపిరి పోసుకుంటాయో లేదో చూడాలి.