Reading Time: 2 mins

Happy Birthday To Devi Sri Prasad -TEL

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్,సింగర్,గేయ రచయితగా దేవి శ్రీ ప్రసాద్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ప్రముఖ రచయిత సత్యమూర్తి గారి మొదటి కుమారుడు.1979 ఆగస్ట్ 2 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా వెదురుపాక అనే గ్రామంలో జన్మించాడు.అప్పటి తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ లో ఉండటంతో అక్కడే తన బాల్యం,చదువు అంతా సాగింది.

నేటితో దేవి శ్రీ ప్రసాద్ కి 44 ఏళ్ళు పూర్తయ్యాయి.

businessoftollywood.com తరుపున దేవి శ్రీ ప్రసాద్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ మునుముందు మరిన్ని మంచి పాటలతో యువతని అలరించాలని ఆకాంక్షిస్తోంది.

దేవికి చిన్నప్పటినుండి మ్యూజిక్ మీద వున్న ఆసక్తిని గమనించిన సత్యమూర్తి గారు మ్యూజిక్ స్కూల్ లో చేర్పించారు. దాంతో మ్యూజిక్ తో పాటు డాన్స్ లాంటి కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటూ టీనేజ్ లోనే ‘డ్యాన్స్ పార్టీ’ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేశాడు.

ప్రముఖ మాండలీన్ వాయిద్యకారుడు U శ్రీనివాస్ గారు దేవి శ్రీ ప్రసాద్ కి గురువు.ప్రముఖ సంగీత దర్శకులు మ్యాస్ట్రో ఇళయరాజా , ఎ ఆర్ రెహమాన్ లకి వీరాభిమాని.

1999 లో కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఆనందం సినిమా మ్యూజిక్ తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని నేడు పుష్ప-2తో నేషనల్ లెవెల్ లో క్రేజ్ ని సొంతం చేసుకొన్న తన ఈ  25 ఏళ్ళ మ్యూజిక్ కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళు వున్నాయి.

దేవి శ్రీ ప్రసాద్ అందుకున్న అవార్డ్స్ :

  1. 2004 లో ‘వర్షం’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్)
  2. 2004 లో ‘వర్షం’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోషం అవార్డ్
  3. 2005 లో ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్)
  4. 2005 లో ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోషం అవార్డ్.
  5. 2006 లో ‘బొమ్మరిల్లు ’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్).
  6. 2008 లో ‘ జల్సా ‘ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోషం అవార్డ్ .
  7. 2010 లో ‘ ఆర్య 2 ‘ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ మా (CineMaa)అవార్డ్ .
  8. 2012 లో ‘గబ్బర్ సింగ్’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్).
  9. 2013 లో ‘అత్తారింటికి దారేది’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్).
  10. 2015 లో ‘ శ్రీమంతుడు‘  సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్).
  11. 2016 లో ‘ జనతా గ్యారేజ్’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్).
  12. 2019 లో ‘ నాన్నకు ప్రేమతో’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్).
  13. 2019 లో ‘ రంగస్థలం‘ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ ( సౌత్).
  14. 2019 లో ‘ రంగస్థలం‘ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా SIIMA అవార్డ్ ( సౌత్).

మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సెలెక్టెడ్ చిత్రాలు :

  1. దేవి (1999)
  2. నవ్వుతూ బ్రతకాలిరా (2001)
  3. ఆనందం (2001)
  4. కలుసుకోవాలని  (2002)
  5. సొంతం (2002)
  6.  ఖడ్గం (2002)
  7. మన్మధుడు(2002)
  8.  తొట్టి గ్యాంగ్ (2002)
  9. వర్షం (2004)
  10. వెంకి (2004)
  11. ఆర్య (2004)
  12. శంకర్ దాదా MBBS(2004)
  13. ఆరు (2005)
  14. బన్నీ (2005)
  15. నువ్వొస్తానంటే నేనోద్దంటానా(2005)
  16. బొమ్మరిల్లు (2006)
  17. పౌర్ణమి (2006)
  18. రాఖీ (2006)
  19. జగడం (2007)
  20. జల్సా (2008)
  21. రెడీ (2008)
  22. కింగ్ (2008)
  23. ఆర్య 2(2009
  24. నమో వేంకటేశ (2010)
  25. అదుర్స్ (2010)
  26. Mr.ఫెర్ఫెక్ట్ (2011)
  27. 100% లవ్ (2011)
  28. జులాయి (2012)
  29. గబ్బర్ సింగ్ (2012)
  30. మిర్చి (2013)
  31. అత్తారింటికి దారేది (2013)
  32. అల్లుడు శీను (2014)
  33. లెజెండ్ (2014)
  34. S/O.సత్యమూర్తి (2015)
  35. శ్రీమంతుడు (2015)
  36. శివమ్ (2015)
  37. పులి ( విజయ్ 2015)
  38. కుమారి 21F(2015)
  39. నేను శైలజా (2016)
  40. నాన్నకు ప్రేమతో (2016)
  41. సర్దార్ గబ్బర్ సింగ్ (2016)
  42. జనతా గ్యారేజ్ (2016)
  43. ఖైదీ నెం.150(2017)
  44. నేను లోకల్ (2017)
  45. రారండోయ్ వేడుక చూద్దాం (2017)
  46. దువ్వాడ జగన్నాధం (2017)
  47. జయ జానకి నాయక (2017)
  48. జై లవ కుశ (2017)
  49. M C A(2017)
  50. రంగస్థలం (2018)
  51. భరత్ అనే నేను (2018)
  52. హలో గురు ప్రేమ కోసం (2018)
  53. వినయ విధేయ రామ (2019)
  54. కుమారి 21F(2019)
  55. చిత్రలహరి (2019)
  56. మహర్షి (2019)
  57. సరిలేరు నీకెవ్వరు (2020)
  58. ఉప్పెన (2021)
  59. రంగ్ దే (2021)
  60. అల్లుడు అదుర్స్ (2021)
  61. పుష్ప (2021)
  62. రౌడీ బాయ్స్ (2022)
  63. గుడ్ లక్ సఖి (2022)
  64. ఖిలాడి (2022)
  65. F 3(2022)
  66. ఆడవాళ్ళూ మీకు జోహార్లు (2022)
  67. ది వారియర్ (2022)
  68. రంగ రంగ వైభవంగా (2022)
  69. వాల్తేర్ వీరయ్య (2023)
  70. రత్నం ( 2024 )

రాబోవు చిత్రాలు :

  1. కంగువ
  2. పుష్ప-2
  3. తండేల్
  4. ఉస్తాద్ భగత్ సింగ్
  5. హంటర్
  6. గుడ్ బ్యాడ్ అగ్లీ
  7. కుబేర

వీటితో పాటు సుమారు 100 చిత్రాల వరకు తెలుగు మరియు తమిళ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.