Reading Time: 2 mins

హారొమ్ హర మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

స్టోరీ విషయానికి వస్తే.. సుబ్రహ్మణ్యం ( సుధీర్ బాబు) ఒక కాలేజీ లో ల్యాబ్ అసిస్టెంట్ గా చేస్తూ దేవి ( మాల్వికా శర్మ) తో లవ్ లో ఉంటాడు. తమ్మిరెడ్డి (లక్కి లక్ష్మణ్) తన తమ్ముడు, కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) లతో అత్యంత క్రూరంగా ప్రజల్ని హింసిస్తూ, వారి భూములు లాక్కొని భయపెడుతూ తానే కింగ్ లా జీవిస్తాడు. ఒకరోజు సుబ్రహ్మణ్యం తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడి జాబ్ పోగొట్టుకొంటాడు. తన తండ్రి (జయప్రకాష్) చేసిన అప్పు తీర్చడానికి పళనిస్వామి (సునీల్) తో కలిసి గన్స్ తయారీ మొదలుపెడతాడు. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన తండ్రికి తమ్మిరెడ్డి వల్ల ఆపద ఎలా వస్తుంది? తన ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేస్తాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ :

చావుని చూసి చలించనోడు.. ఖచ్చితంగా చెడ్డోడు..

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :

సుధీర్ బాబు నటన చాలా బాగుంది. ఈ సినిమాలో తన నుంచి 100 శాతానికి మించి సుధీర్ బాబు అందించాడు. తన లుక్స్ అయితేనేం, మాట, నడవడిక అన్నిట్లో కూడా తాను అదరగొట్టేసాడు. అలాగే తనపై పలు ఎమోషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లు కానీ చాలా బాగున్నాయి.సునీల్ ఫలని స్వామిగా మంచి నటన కనబరిచారు. ఇంకా మాళవిక మోహనన్ పాత్ర కూడా బాగుంది. ఇంకా విలన్ పాత్రల్లో కనిపించిన నటుడు కేజీయఫ్ ఫేమ్ లక్కి లక్ష్మణ్ సాలిడ్ విలనిజాన్ని చూపించారు అని చెప్పాలి. అర్జున్ గౌడ , జయప్రకాశ్, అక్షర గౌడ తదితరులు బాగా నటించారు.

టెక్నికల్ గా :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక మంచి స్టోరీ ని సెలెక్ట్ చేసుకొన్నా..స్క్రీన్ప్లే విషయంలో తడబడ్డాడు. స్టోరీ గొప్పగా ఉన్న, డైరెక్షన్ బాగా చేసినా స్క్రీన్ ప్లే వీక్ గా ఉంటె సినిమా రిజల్ట్ బాగుండదు. చైతన్ భరద్వాజ్ చాలా మంచి సంగీతం అందించారు. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బానే ఉంది కాని కొన్ని సీన్స్ ని వేగవంతం చేయాల్సింది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా సెటప్ కి తగ్గట్టుగా వింటేజ్ బ్యాక్ డ్రాప్ అంతా నీట్ గా ఉంది.

చూడచ్చా :

చూడలేము

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ,
బ్యాక్ డ్రాప్,
సుదీర్ బాబు నటన ,
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

తీర్పు :

హరోంహర .. అత్తిలి చిరబర..

నటీనటులు:

సుధీర్ బాబు, మాల్వికా శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు

సాంకేతికవర్గం :

సినిమా టైటిల్ : హ‌రోం హ‌ర‌
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
విడుదల తేదీ: 14062024
సెన్సార్ రేటింగ్: “ A “
దర్శకత్వం: జ్ఞాన సాగర్ ద్వారక
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
నిర్మాత: సుమంత్ జి. నాయుడు
రన్టైమ్: 153 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్