Hero Kirishna Vamsi Interview
‘అలనాటి రామచంద్రుడు’కి ఆడియన్స్ థౌజెండ్ పెర్సెంట్ కనెక్ట్ అవుతారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ సూపర్బ్ గా వుంటాయి : హీరో కృష్ణ వంశీ
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ ప్రొడక్షన్& డిస్ట్రిబ్యుషన్ సంస్థ SVC ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో హీరో కృష్ణ వంశీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీకు సినిమాలపై ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది ? మీ జర్నీ గురించి చెప్పండి ?
మాది కడప. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి, పాషన్. ముఖ్యంగా మాస్ సినిమాలంటే చాలా ఇష్టం. బాలయ్య బాబు గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారి సినిమాలు.. ఇలా మాస్ సినిమా ఏదున్నా ఫస్ట్ డేనే చూసేవాడిని. కాలేజ్ లో వున్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించాను. ఇంజినీరింగ్ చేశాను. క్యాంపస్ ప్లేస్ మెంట్ వచ్చింది. అప్పటికీ సినిమా అంటే ఇంట్రస్ట్ పోలేదు. కోవిడ్ సమయంలో సత్యనంద్ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. హైదరాబాద్ వచ్చి సినిమా ప్రయత్నాలు చేశాను. ఈ క్రమంలో డైరెక్టర్ ఆకాష్ గారిని కలిశాను. నా ఆడిషన్ ఆయనకి నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఇది నా అదృష్టం. చాలా ఆనందంగా వుంది. మా తల్లితండ్రులు, గురువులు, ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సయిటింగ్ గా చూస్తున్నాను.
‘అలనాటి రామచంద్రుడు’ కథలో మీకు నచ్చిన పాయింట్ ఏమిటి ?
-డైరెక్టర్ ఆకాష్ గారు చాలా అద్భుతమైన కథ చెప్పారు. మ్యూజిక్, విజువల్స్ రెఫరెన్స్ తో సహా చెప్పారు. ఆయన చెప్పినపుడే మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఇందులో నా పాత్ర పేరు సిద్దు. తనది ఇంట్రో వర్ట్ క్యారెక్టర్. చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. చాలా సెటిల్ గా పెర్ఫార్ చేసే రోల్. చేయడానికి నాకు ఛాలెంజింగ్ గా వుంటుందనిపించింది. అలాగే ఈ కథలో మంచి ఎమోషనల్ జర్నీ వుంది. ఈ రెండు నాకు చాలా నచ్చాయి.
ఈ సినిమా కోసం మీరు చేసిన హోం వర్క్ ఏమిటి ?
-ఇందులో నాది ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. హాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు చూశాను. అవి చూసి కొన్ని నేర్చుకున్నాను. అలాగే ఈ పాత్రకు చాలా దగ్గరైన నా ఫ్రెండ్ వున్నాడు. వాడిని గుర్తు చేసుకున్నాను. తను నాకు మంచి రిఫరెన్స్ గా యూజ్ అయ్యాడు.
‘అలనాటి రామచంద్రుడు’ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమానా ?
-యూత్ థౌజెండ్ పెర్సెంట్ కనెక్ట్ అవుతారు. అలాగే ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఎమోషన్ కనెక్ట్ అయితే ఎవరికైనా నచ్చుతుంది. అలాంటి ఎమోషన్ కనెక్ట్ అయ్యే కథ. ఇందులో ఫాదర్డాటర్ ఎమోషన్, మదర్సన్ ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా వుంటాయి.
‘అలనాటి రామచంద్రుడు’ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
-ఇందులో సిద్దు పాత్ర చాలా నిజాయితీ గల మనిషి. రాముడు లాంటి మనిషి. ఒక్క అబద్ధం కూడా చెప్పడు. తనలో తనే ఘర్షణ పడుతుంటాడు. సినిమా బ్యూటీఫుల్, పొయిటిక్ గా వుంటుంది. సముద్రంలో చాలా అలజడులు వుంటాయి. నా పాత్ర కూడా అలాంటిదే. ఇందులో హీరోయిన్ పాత్ర పేరు ధరణి. సముద్రం, భూమి ఎలా కలుస్తారనేది చాలా పొయిటిక్ గా ప్రజెంట్ చేశారు.
-డైరెక్టర్ ఆకాష్ చెప్పినదాని కంటే ఇంకా బాగా తీశారు. మ్యూజిక్ చాలా బావొచ్చింది. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిరికార్డింగ్ చాలా అద్భుతంగా వచ్చింది. విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా వుంటాయి. సినిమా చాలా బావొచ్చింది. అంతా పాజిటివ్ గా వుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.
ఇందులో డ్యాన్స్, ఫైట్స్ ఉన్నాయా ?
వున్నాయి. డ్యాన్స్ చిన్నప్పటి నుంచి చేసేవాడిని. ఫైట్స్ చేయడం ఫస్ట్ టైం. ఎమోషన్ కి తగ్గట్టే ఫైట్స్ వస్తాయి. కొన్ని స్టంట్స్ నేర్చుకున్నాను.
హీరోయిన్ మోక్ష తో వర్కింగ్ గురించి ?
మోక్ష నా కంటే సీనియర్. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. అయినప్పటికీ తను చాలా డౌన్ టు ఎర్త్ వుంటుంది. మా పాత్రలకు తగ్గట్టు కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. తను చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు.
-మా నిర్మాతలు శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, డైరెక్టర్ ఆకాష్ ఎప్పటికీ రుణపడి వుంటాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. అలాగే దిల్ రాజు గారు సపోర్ట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను.
కొత్త కథలు విన్నారా ?
-‘అలనాటి రామచంద్రుడు’ హీరోగా నా మొదటి మెట్టు. ప్రస్తుతం ఈ సినిమాపైనే నా ద్రుష్టి వుంది. కొన్ని కథలు విన్నాను, ఒక విలేజ్ డ్రామా సబ్జెక్ట్ డిస్కర్షన్ జరుగుతోంది. హీరోగా డిఫరెంట్ రోల్స్ చేయాలని వుంది.
అల్ ది బెస్ట్
-థాంక్ యూ