Hero Sathyadev Interview
హీరో సత్యదేవ్ ఇంటర్వ్యూ
‘జీబ్రా’లాంటి గొప్ప కథతో రావడం నా అదృష్టం. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: హీరో సత్యదేవ్
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో సత్య దేవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
జీబ్రా టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
-జీబ్రా..బ్లాక్ అండ్ వైట్ కి మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరివరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే వుంటుంది. అందుకే టైటిల్ ఫాంట్ కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్ తో వచ్చింది. అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.
బ్యాంక్ క్రైమ్ నేపధ్యంలో ఇటివల లక్కీ భాస్కర్ వచ్చింది కదా.. దానికి దీనికి డిఫరెన్స్ ఏమిటి ?
-లక్కీ భాస్కర్ పిరియడ్ కథ. జీబ్రా కాంటెంపరరీ స్టొరీ. బ్యాంకర్ అనే క్యారెక్టర్ తప్పితే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు బ్యాంక్ సిస్టం అంతా డిజిటల్ అయ్యింది. ఇప్పుడు క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్ లో పని చేసే వాళ్లకి తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే మిస్ స్టేక్స్ తెలీవు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్ లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్ తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ తో ఈ కథని రాశారు.
-ఏటీఎం లో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుందనేదే ఈ సినిమా. కామన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను బ్యాంకర్ ని. ధనుంజయ గ్యాంగ్ స్టర్.. మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది.
డాలీ ధనంజయతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ?
-ఈ జర్నీలో చాలా క్లోజ్ అయ్యాం. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో చాలా మంచి శ్వాగ్ వుంటుంది. కంప్లీట్ డిఫరెంట్ గాచేశాడు. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులు ఇంకా దగ్గరౌతాడు. సినిమా కన్నడ లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడ తనకి మంచి ఫ్యాన్ బేస్ వుంది. అక్కడ కూడా సినిమా బాగా ఆడుతుంది.
-సునీల్, సత్యరాజ్, సత్య, ప్రియా భవానీ శంకర్ ఇలా పాత్రలన్నీ రెండు వరల్డ్స్ నుంచి ఎలా కలుస్తాయనేది చాలా ఆసక్తికరంగా వుంది.
ఈశ్వర్ కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది ?
-ఈ కథ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. ఇంత గొప్ప కథ మనదగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని విన్నపుడే ఫిక్స్ అయ్యాను. సినిమా రిలీజైన తర్వాత ఆయన రైటింగ్, డైరెక్షన్ కి చాలా మంచి పేరు వస్తుంది.
ఇందులో క్యారెక్టర్ మీలోని యాక్టర్ కి ఛాలెంజ్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
-నాకు కామన్ మ్యాన్ రోల్స్ ఇష్టం. ఇందులో ఆ కామన్ మ్యాన్ కనెక్ట్ నచ్చింది. ఇందులో లుక్ మారుస్తున్నాను. బ్యాంకర్ రోల్ ఇప్పటివరకూ చేయలేదు. అది ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇప్పటివరకూ దాదాపు సీరియస్ రోల్స్ చేశాను. దాన్ని బ్రేక్ చేద్దామని దర్శకుడు ఈశ్వర్ కూడా బావించారు. ఇందులో చాలా కొత్త సత్యదేవ్ ని చూస్తారు. కామన్ మ్యాన్ విన్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్.
మీకు మంచి సినిమా పడితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటారని చిరంజీవి గారు అన్నారు.. జీబ్రా మీకు అలాంటి సినిమా అవుతుందా ?
-అవుతుంది. నిన్న కొంతమంది సినిమా చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు కొన్ని పెయిడ్ ప్రిమియర్స్ అవుతున్నాయి. టీం అంతా ఎక్సయిటెడ్ గా వున్నాం. జీబ్రాకి అన్నీ అద్భుతంగా కుదిరాయి.
చిరంజీవి గారు సినిమా చూశారా ?
-అన్నయ్య(చిరంజీవి) జపాన్ వెళ్లారు. రాగానే తప్పకుండా చూస్తారు. అన్నయ్య స్ఫూర్తితో పరిశ్రమలోకి వచ్చాను. ఆయన గుడ్ బుక్స్ లో నేను వుండటం అదృష్టంగా భావిస్తున్నాను.
ఇది క్రైమ్ స్టొరీ కదా.. మ్యూజిక్ ఎలా కుదిరింది ?
ఇందులో అన్నీ మాంటేజస్ సాంగ్స్ వుంటాయి. ప్రతి పాట కథలో బాగంగా వస్తుంది. రవి బస్రూర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ టెర్రిఫిక్ గా వుంటుంది.
నిర్మాతల గురించి ?
నా బిగ్గెస్ట్ మూవీ ఇది. ఈ సినిమా స్పాన్ కి చాలా బడ్జెట్ కావాల్సివచ్చింది. అద్భుతమైన వరల్డ్ బిల్డింగ్ చేశారు. అది చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
‘ఫుల్ బాటిల్’ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్. వెంకటేష్ మహా తో ఓ సినిమా వుంటుంది. చాలా గ్రేట్ స్టొరీ కుదిరింది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ