Hero Yash Movie in Hollywood
హాలీవుడ్ పై కన్నేసిన యష్
కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు హీరో యష్ కు ఎంత పెద్ద పేరు తీసుకొచ్చాయో చెప్పాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు అవడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న యష్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ పై కన్నేశాడు. యష్ తాజాగా నటిస్తున్న టాక్సిక్: ఎ పెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను పక్కా ప్లాన్ తో రూపోందిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అయితే షూటింగ్ మాత్రం కన్నడ, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఒరిజినల్ గా షూట్ చేస్తున్నారు.
కన్నడ సినిమా ఇంగ్లీషులో చిత్రీకరించడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ చిత్రం వివిధ భాషా, సాంస్కృతిక నేపథ్యాలతో ముడిపడి ఉన్న కథ. అన్ని ప్రాంతాల వారు ఆస్వాదించేలా రూపొందిస్తున్నట్లు చెప్పారు. యాక్షన్ సీక్వెన్స్‌లు భారీ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జేజే పెర్రీ
స్టంట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు గీతూ మోహన్ దాస్ చెప్పారు.