Reading Time: < 1 min

Hey Chikhita Movie Launched

“హే చికితా” మూవీ షూటింగ్ ప్రారంభం

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్ల పై ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ , ‘గరుడవేగ’ అంజి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం “హే చికితా”. యువ దర్శకుడు ధన్‌రాజ్  లెక్కల, కథ, కథనం, దర్శకత్వంతో నూతన దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఈ చిత్రం లో వైఫ్ ఆఫ్ ఫేమ్ అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి హీరో, హీరోయిన్లగా నటిస్తుండగా, 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత,  సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలో మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ నటిస్తున్నారు.

ఈ మూవీ టైటిల్ ని డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. అనుసూయ భరద్వాజ్, సాయి రాజేష్ ,వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియా వేదికగా రివిల్ చేశారు.

అందరికీ వాలెంటైన్స్ డే విషెష్ తెలుపుతూ ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైయింది. తెలంగాణ, ఆంద్రాలోని పలు అద్భుతమైన లొకేషన్ లో శర వేగంగా షూటింగ్ జరుపుకోనుంది.

చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీతాని అందించిన ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ‘గరుడవేగ’ అంజి చేయునున్నారు. ఎడిటర్ గా మధు  పని చేస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిందర్ బెక్కం.

నటీనటులు :

అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి, 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత,  సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి, మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ తదితరులు
సాంకేతిక వర్గం :

బ్యానర్స్: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP
నిర్మాతలు: ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ , ‘గరుడవేగ’ అంజి
రచన, దర్శకత్వం:  ధన్‌రాజ్ లెక్కల
మ్యూజిక్: చరణ్ అర్జున్
డీవోపీ: ‘గరుడవేగ’ అంజి
ఎడిటర్: మధు