High Court Grants Interim Bail To Allu Arjun
అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్
పుష్ప ది రూల్ మూవీ విడుదలై అన్ని ఏరియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డిసెంబర్ 4 న జరిగిన ప్రీమియర్స్ షోలకు సైతం భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. ఇదే క్రమంలో సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ తో సహా మూవీ టీమ్ అంతా వెళ్లారు. స్టార్ హీరో సినిమాలకు అభిమానులు ఎలా వస్తారో అందరికి తెలిసిందే. అలాగే సంధ్య థియేటర్ లో అభిమానలు పెద్ద సంఖ్యలో వెళ్లారు. పోలీసులు బందోబస్తు ఉన్నప్పటికీ అభిమానుల తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటలో ఒక బాలుడు గాయపడగా, ఒక మహిళ సైతం గాయపడింది. వెంటనే చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
డిసెంబర్ 5 న సినిమా విడుదలైంది. దేశం అంతా కలెక్షన్ల వర్షం కురిపించింది. అభిమాని మరణవార్త తెలిసిన అల్లు అర్జున్ వెంటనే స్పందించారు. ఒక వీడియో విడుదలచేశారు. దానిలో తన సంతాపాన్ని తెలియజేస్తూ రూ.25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అక్కడితో సమస్య సమసిపోతుంది అనుకున్నారు. కానీ మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసలకు గౌరవం ఇచ్చి వారికి సహకరించారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరఫు న్యాయవ్యాది వాదనలు వినిపించారు. ఇక అల్లు అర్జున్ పై ఉన్న కేసులను పరీశిలించిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పును వెలవరించింది. దాంతో అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు తరలించారు పోలీసులు.
ఆ తరవాత అల్లు అర్జన్ తరఫు న్యాయవాది మధ్యంత బెయిల్ కు అప్లై చేశారు. దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అల్లు అర్జున్ పై ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకొని షరతులతో కూడిన మధ్యంత బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. బెయిల్ మంజూరు అయింది కానీ అల్లు అర్జున్ ను ఎప్పుడు విడదల చేస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.