History Of Telugu Cinema 1971-72
తెలుగు సినిమా చరిత్ర 1971-72
1971 లో మొత్తం 65 చిత్రాలు విడుదలైయ్యాయి. వీటిలో 40 చిత్రాలు సామాజిక గాధలే కావడం విశేషం.
ఈ సంవత్సరం శ్రీకృష్ణసత్య, సతీ అనసూయ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో శ్రీకృష్ణసత్య సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది.
ఈ సంత్సరం మోసగాళ్లకు మోసగాడు, మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త, దెబ్బకు ఠా దొంగల ముఠా, జేమ్స్ బాండ్ 777, జగత్ జంత్రీలు, రివాల్వార్ రాణి వంటి కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలు విడుదలయ్యాయి.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ట్రెజర్ హంట్ పేరిట ఇంగ్లీష్ లో డబ్ చేసి హాలీవుడ్ లో విడుదల చేశారు.
1972లో 55 చిత్రాలు విడుదలయ్యాయి. ప్రముక గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటించిన మొదటి సినిమా మహ్మాద్ బీన్ తుగ్లక్ ఇదే సంవత్సరం విడుదలైంది.
బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణం పూర్తి కలర్ లో తీశారు. ఈ చిత్రం ఇదే సంవత్సరం విడుదలైంది. శోభన్ బాబు, చంద్రకళ, జమున, ఎస్వీరంగారావు తదితరులు నటించారు.
కాలం మారింది చిత్రం కూడా ఇదే సంవత్సరం విడుదలైంది. శోభన్ బాబు, శారద నటించిన ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా రాష్ట్రం ఇచ్చే స్వర్ణ నంది అవార్డును గెలుచుకుంది.