History Of Telugu Cinema 1973-74
తెలుగు సినిమా చరిత్ర 1973-74
1973లో మొత్తం 61 చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం విజయ నిర్మల దర్శకురాలిగా పరిచయం అయ్యాయి. మీనా సినిమాతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు విజయ నిర్మల. ఈ సంవత్సరం బాపు దర్శకత్వంలో వచ్చిన అందాల రాముడు చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి రజిత నంది అవార్డు గెలిచుకుంది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తీసిన గాంధీపుట్టిన దేశం చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు ఆర్థికంగా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే ఈ సంవత్సరం క్రాంతి కుమార్ నిర్మించిన శారద చిత్రానికి రాష్ట్రప్రభుత్వం ఇచ్చే స్వర్ణ నంది అవార్డు వచ్చింది.
1974లో మొత్తం 60 చిత్రాలు విడుదలయ్యాయి. కమెడియన్ రాజబాబు నర్మించిన ఎవరికి వారే ఎమున తీరే చిత్రం ఇదే సంవత్సరం విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ నంది వచ్చింది. అలాగే ఓ సీత కథ చిత్రానికి రజత నంది వచ్చింది. తీర్పు చిత్రానికి కాంస్య నంది అవార్డు వచ్చింది. పీ. గంగాధరరావు తెరకెక్కించిన నీడలేని ఆడది చిత్రం ద్వారా నరసింహరాజు, ప్రభను తెరకు పరిచయం చేశారు. ఇదే సంవత్సరం నందమూరి బాలకృష్ణ వెండి తెరకు పరిచయం అయ్యారు. హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా నటించిన రామ్ రహిమ్ చిత్రం ఇదే సంవత్సరం విడుదలైంది.