History Of Telugu Cinema 1977-78
తెలుగు సినిమా చరిత్ర 1977-78
1977లో 72 చిత్రాలు విడుదలయ్యాయి. ఇదే సంవత్సరం ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ, కృష్ణ నటించిన కురుక్షేత్రం విడుదలై పోటీపడ్డాయి. వీటిలో దానవీర శూరకర్ణ చిత్రం ఘన విజయం సాధించింది.
ఎన్టీఆర్ హీరోగా, నిర్మించి దర్శకత్వం చేసిన చాణిక్య చంద్రగుప్త సినిమా ఇదే సంవత్సరం విడుదలైంది. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ సైతం నటించారు. ఈ ఏడాది విడుదలైన ఊరమ్మడి బ్రతుకులు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్రప్రభుత్వం అవార్డును ఇచ్చింది. అలాగే ఒక ఊరి కథ చిత్రాన్ని 1977లో కార్లోవారి ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. కేంబ్రిడ్జి ఫిల్మ్ ఫెస్టివల్ లో 1980లో ప్రదర్శించారు.
1978లో 80 చిత్రాలు విడుదలయ్యాయి. వీఎస్ఆర్ స్వామి నిర్మాతగా మారి శ్రీ అపర్ణ మూవీస్ సంస్థను స్థాపించి కలియుగ స్త్రీ అనే సినిమాను నిర్మించారు. పి. బాలరామిరెడ్డి నిర్మాతలుగా స్వర్గసీమ సినిమాను నిర్మించారు. దాసరి నారాయణ రావు నిర్మాతగా మారిన చిత్రం శివరంజిని ఇదే సంవత్సరం విడుదల చేశారు. ఈ ఏడాది సతీసావిత్రి, అక్బర్ సలీం అనార్కలి, దేవదాసు మళ్లీ పుట్టాడు, మరో చరిత్ర వంటి సినిమాలు విడుదలయ్యాయి.