History Of Telugu Cinema 1979-80
తెలుగు సినిమా చరిత్ర 1979-80
1979లో 92 చిత్రాలు విడుదలయ్యాయి. ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా తాయారమ్మ-బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు. కే. బాల చందర్ కళాకేంద్ర సంస్థను స్థాపించి గుప్పెడు మనసు, మనిషికి మరోవైపు చిత్రాలను నిర్మించారు. దేవర్ ఫిలింస్ సంస్థవారు అమ్మ ఎవరికైన అమ్మ అనే సినిమాను నిర్మించారు. కోగంటి కుటుంబరావు శ్రీ పద్మజా పిక్షర్స్ ను స్థాపించి తాతినేనే ప్రకాశ్ రావు దర్శకత్వంలో చిరంజీవి రాంబాబు చిత్రానికి నిర్మించారు.
1980లో 110 చిత్రాలు నిర్మించారు. విప్లవ సిినిమాలకు పేరు గాంచిన మాదాల రంగారావు నిర్మించిన యువతరం కదిలింది సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ నందిని ఇచ్చింది. ఆయన సినిమాలకు సెన్సార్ సెర్టీఫికేట్ అంత ఈజీగా వచ్చేది కాదు, అలా ఆయన నిర్మించిన ఎర్రమట్టి చిత్రానికి 5 సంవత్సరాలు పట్టింది. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో సప్తపది చిత్రానికి కేంద్రప్రభుత్వం తొలి నర్గిస్ దత్ అవార్డును ఇచ్చింది. ఈ సంవత్సరం శివమెత్తిన సత్యం, ఏడంతస్తుల మేడ, అద్దాల మేడ వంటి చిత్రాలు విడుదలయ్యాయి.