Reading Time: < 1 min

History Of Telugu Cinema 1981-82
తెలుగు సినిమా చరిత్ర 1981-82

కమలహాసన్ ఆయన సోదరుడు చంద్రహాసన్ ఇద్దరూ కలిసి హాసన్ బ్రదర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అమావాస్య చంద్రడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీలో ఎల్వీ ప్రసాద్ నటించారు.
జీఆర్‌కే రాజు విశ్వమిత్ర బ్యానర్ ను స్థాపించి ట్యాక్సీడ్రైవర్ అనే చిత్రానికి నిర్మించారు. ఈ చిత్రంలో జయప్రద, కృష్ణం రాజు నటించారు.
1981లో భారతీయ టాకీ స్వర్ణోత్సవాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వేడుకను డిసెంబర్ 4న హైదరాబాద్ లోని రవింద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాయింటి మాలక్ష్మీ చిత్రానికి నర్మించిన పి. గంగాధరరావు ను సన్మానించారు.
ఇదే సంవత్సరం జూన్ 12న అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య ఫిల్మ్ నగర్ కు శంకుస్థాపన చేశారు.

1982లో పింజల నాగేశ్వర రావు నిర్మాతగా పీఎన్ఆర్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై బిల్లారంగా, తల్లికొడుకు సినిమాలు నిర్మించారు.
కొడలి బోసుబాబు 1982లో వీరవాణి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై రాగదీపం చిత్రాన్ని నిర్మించారు.
ఇదే సంవత్సరం నటుడు మోహన్ బాబు లక్ష్మీప్రసన్నబ్యానర్ ను స్థాపించి ప్రతిజ్ఞ అనే సినిమాను నిర్మించారు.
అట్లూరి రాధకృష్ణ శ్రీనివాస్ ప్రొడక్షన్ స్థాపించి పట్నం వచ్చిన పతివ్రతలు నిర్మించారు.
కేఎస్ రామారావు క్రియేటీవ్ కమర్షియల్ నిర్మణ సంస్థను స్థాపించి యండమూరి వీరేంద్రనాథ్ రాసిని అభిలాష నవల ఆధారంగా అదే టైటిల్ తో చిరంజీవితో సినిమా చేశారు.