History Of Telugu Cinema-3
తెలుగు సినిమా చరిత్ర ఎపిసోడ్-3
1936లో తెలుగు సినిమాలో కొత్త మార్పు వచ్చింది. అప్పటివరకు అన్ని పౌరాణిక చిత్రాలే వచ్చాయి. నాటకాల బాణీలలో పాటలు ఉండేవి. ఈ సంవత్సరం సాంఘిక చిత్రం పరిచయమైంది. కృత్తివెంటి నాగేశ్వరరావు నిర్మించిన ‘ప్రేమ విజయం’ సినిమా తెలుగులో తొలి సాంఘిక చిత్రం. అయితే కల్పిత కథ, కల్పిత పాత్రలు పైగా సినిమాలోని వస్తువు ప్రేమ.. దీంతో ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవలేదు. ప్రేమ విజయం పరాజయం చెందడంతో ఇంకెవరు ఈ ప్రయోగాలను చేయలేదు. అందరికి తెలిసిన పౌరానికాలే తీశారు. అందుకే ఒకే కథను.. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణ అనే రెండు సినిమాలు తెరకెక్కించారు. గూడవల్లి రామబ్రహ్మం 1937లో మాలపిల్ల అనే సాంఘిక చిత్రంతో హిట్ కొట్టన తరువాత మళ్లీ సంఘికాలు మొదలయ్యాయి. 1936లో నిడమర్తి సూరయ్య సంపూర్ణ రామాయణం సినిమాను నిర్మించారు. ఈ చిత్రమే తెలుగు నేలపై తీసిన మొదటి ఫీచర్ ఫిలిమ్ అని అంటారు.
తెలుగులో మొదటి డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ క్వాలిటీ పిక్చర్స్. ఈ సంస్థ నుంచి సతీ అహల్య, చింతామణి వంటి చిత్రాలు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. జీకే మంగరాజు గారు ఇదే బ్యానర్ పై 1937లో దశావతారాలు సినిమాను తెరకెక్కించి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ తర్వాత 1940లో సొంతంగా పూర్ణ పిక్చర్స్ ను స్థాపించి తెలుగులో డిస్ట్రిబ్యూటింగ్ మొదలుపెట్టారు. ఈ పూర్ణా సంస్థ నుంచి తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో 200కు పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదే సంవత్సరం అంటే 1937 లో బాలయోగిని, తుకారం వంటి చిత్రాలు నిర్మాణం జరిగింది. అయితే భక్త తుకారం 1938లో విడుదలైంది.
తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు, నిర్మాత రామబ్రహ్మం. ప్రజల్లో స్వాతంత్ర భావాలను నింపాలని కొంత కాలం పత్రికలు నడిపారు. ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలంటే సినిమా రంగం కరెక్ట్ అని భావించారు. అలా 1938లో సారధి ఫిలిమ్స్ బ్యానర్ పై ‘మాలపిల్ల’ అనే మూవీని నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రం ఓ సంచలనం. ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని కొన్ని వర్గాలు విశ్వప్రయత్నాలు చేశాయి.. రామబ్రహ్మం గారు దేనికి భయపడలేదు.. పైగా వారికి ఫ్రీ టికెట్ అనే ఆఫర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత రైతుబిడ్డ అనే మరో సంచలనమైన సినిమాను నిర్మించారు. ఇది జమీందారు వ్యవస్థను నిలదీసింది. ఈ చిత్రాన్ని ప్రభుత్వం నిషేధించింది. అంటే గవర్నమెంట్ బ్యాన్ చేసిన మొదటి తెలుగు చిత్రం రైతుబిడ్డ.
గూడవల్లి రామబ్రహ్మం గారు చిత్ర కథను తయారు చేసుకుంటే ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ మాటలు రాసేవారు అలా రైతుబిడ్డ చిత్రాన్ని 1939 లో నిర్మించారు ప్రభుత్వం ఈ చిత్రాన్ని నిషేధించడంతో ఆర్థికంగా కొంత నష్టం వచ్చింది కొంత గ్యాప్ తీసుకున్న రామబ్రహ్మం గారు 1940లో ఇల్లాలు 1941లో అపరాదు 1942లో పత్ని సిినిమాలను తెరకెక్కించి మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు ఆ తర్వాత పురపాలక సంఘంలో జరిగే అన్యాయాలను చూపిస్తూ.. 1943లో పంతులమ్మ అనే సినిమాను తీశారు. 1945లో మాయాలోకం అనే జానపద చిత్రాన్ని నిర్మించారు. ఇదే సంవత్సరం దక్షిణ భారత ఫిలిం ఛాంబర్ కు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆయన ఎప్పటినుంచో కలలుగంటున్న పల్నాటి యుద్ధం అనే చిత్రాన్ని ప్రారంభించారు కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసి 1947లో విడుదల చేశారు.