Reading Time: < 1 min

Holly Special In TollyWood
తెలుగు సినిమాల్లో హోలీ ప్రత్యేకత

పిల్లలు, పెద్దలు అందరికీ సరదగా ఆడుకునే రంగుల పండుగ హోలి. రంగుల్లో మునిగిపోయి ఆనందోత్సాహంతో ప్రతీ సంవత్సరం జరుపుకుంటాము. ఇంత కలర్ ఫుల్ పండుగను సినిమాలలో చాలా సన్ని వేశాలలో చాలా ప్రత్యేకంగా చూపిస్తారు. హోలి నేపథ్యంలో పాటలు కూడా వచ్చాయి. ఆ పాటలేంటో ఒక సారి చూద్దాం.

మణిరత్నం దర్శకుడిగా కమలహాసన్ నటించిన నాయకుడు చిత్రంలో హోలిని పండుగను పురస్కరించుకొని ఒక పాట ఉంది. సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసేనే నేడు అనే పాట ఎంతో ఆహ్లదంగా ఉంటుంది.

జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా నటించిన ఎమోషనల్ మూవీ రాఖీ చిత్రంలో రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్​సే అనే హోలీ పాట ఉంది. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ స్టెప్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ చిత్రాన్ని కృష్ణవంశి తెరకెక్కించారు. అమ్మాయిలపై జరిగే దాడుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

నాగార్జున నటించిన మాస్ మూవీలో కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా అనే పాట ఉంది. ఈ పాటను కూడా హోలీ నేపథ్యంలోనే తెరకెక్కించారు.

వెంకటేష్, నమిత నటించిన జెమిని చిత్రంలో దిల్ దివానా.. మై హసీనా.. పాట విన్నారా.. ఈ పాట సైతం హోలీ పండుగతో ముడిపడి ఉంటుంది. మరి హోలి పండుగను ఆనందంగా జరుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉందని గుర్తుంచుకోండి.