Reading Time: < 1 min

Laila Movie Ichukundam Baby Lyrical Song Released
లైలా చిత్రం నుంచి ఇచ్చుకుందాం బేబీ లిరికల్ సాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం లైలా. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసిన చిత్రం బృందం తాజాగా ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ ప్రేమికుల రోజు కానుకగా విడుదల అవుతుంది. ఒంటరివాళ్లంతా ఆ రోజు మాకు తోడెవ్వరూ లేరే అని బాధపడుతుంటారు. వాళ్లందరికోసం ఈసారి మా లైలా వస్తోంది అని విశ్వక్ సేన్ అంటున్నారు. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయిక. సాహు గారపాటి నిర్మాతగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. లియోన్‌ జేమ్స్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

పాట విడుదల కార్యక్రమం సందర్భంగా విష్వక్‌సేన్‌ మాట్లాడారు, తన కెరీర్‌లో యాక్షన్‌ టచ్‌తో చేసిన పూర్తిస్థాయి కామెడీ సినిమా ఇదే అన్నారు. లైలా అనే అమ్మాయిగా కనిపిస్తానని అది ఛాలెంజ్ గా తీసుకున్నట్లు చెప్పారు. లేడీ పాత్రాల ముస్తాబవ్వడానికి రోజూ రెండు గంటలు సమయం పట్టేదన్నారు. ఈ గెటప్ తరువాత అమ్మాయిల ఓపికని మెచ్చుకోవాలని అన్నారు.

 

Movie title:-Laila
Banner:-Shine Screens
Release Date:-14-02-2025
Cast- Vishwaksen, Akanksha Sharma
Director:- Ram Narayan
Music: Leon James
Cinematography: Richard Prasad
Producer: Sahu Garapati