IQ చిత్రం పాత్రికేయుల సమావేశం
కె ఎల్ పి మూవీస్ పతాకంపై కాయగూరల రాజేశ్వరి సమర్పించు సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ జి. ఎల్. బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “IQ.
ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరాకి విడుదలకు సిద్ధంగా ఉన్న సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో…
చిత్ర దర్శకుడు జిఎల్‌బి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ నెల 25 తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఒక ఐటెమ్ సాంగ్ సత్యప్రాకాశ్ గారి మీద చేస్తున్నాము. గతంలో కూడా మూడు షెడ్యూల్స్‌లో చిత్రం పూర్తయిపోయింది. రెండు సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. వరికుప్పల యాదగిరి, నాగేంద్రప్రసాద్ ఒక పాట రాస్తున్నారు. చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సినిమాకి చాలా బాగా హైలెట్‌గా నిలిచాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేశాం. ప్రొడ్యూసర్‌గారు ఎంతో కోపరేట్ చేశారు. కె.ఎల్.పి ఫిల్మ్ బ్యానర్ పై లక్ష్మీపతిగారు ప్రొడ్యూసర్‌గా పరిచయం అవుతున్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హీరో తండ్రికి ప్రాడ్యూసర్ కూడా నా ధన్యవాదాలు. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని చాలా కోపరేటివ్‌గా మా పక్కనే ఉన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఘటికాచలం కూడా చాలా మంచి మ్యూజిక్‌ని అందించారు. ముఖ్యంగా కెమెరామెన్ సురేందర్‌రెడ్డిగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా ప్రతి చిత్రానికి ఆయనే కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ…మా అన్న కొడుకు సాయి చరణ్ హీరోగా నటిస్తున్నాడు. వైజాగ్‌లో ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్‌లో శిక్షణ పొంది. బాబాయ్ నాకు యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఉంది అని చెప్పగానే నేను మా అన్నయ్య ముందుకు వచ్చి ఈ సినిమాని తీయడం జరిగింది. దాదాపు 90పర్సెంట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు నటించారు. సుమన్‌గారు ఎంతో శ్రద్ధగా ఆయన సహాయ సహకారాలను అందించారు. ఈ చిత్రాన్ని జూ.్ 18న మొదలు పెట్టాం. ఎక్కడా బ్రేక్ పడకుండా ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. మరో నాలుగు ఐదు రోజులు మాత్రమే ఇంకా ఉంది. ఇక ఈ చిత్రాన్ని దసరా పండుగ రోజున విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్నామని అన్నారు.
హీరో సాయి చరణ్ మాట్లాడుతూ… నేను ఐక్యూ చిత్రంలో హీరోగా చేస్తున్నాను. ఈ చిత్రం జూన్ 18న ప్రసాద్‌ల్యాబ్‌లో మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, ప్రముఖ నిర్మాత కె. యస్. రామారవు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయింది. షూటింగ్ చాలా అద్భుతంగా నడిచింది. కేవలం 2,3 రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. సినిమా చిత్రీకరణ ఎక్కడా ఆగకుండా జరిగింది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా మా బాబాయి లక్ష్మీపతిగారు చేస్తున్నారు. అలాగే దర్శకులు జిఎల్‌బి శ్రీనివాస్‌గారు చేశారు. ఇది మా మొదటి చిత్రమే అయినా అనుకోకుండా ఇందులో అందరూ పెద్ద పెద్ద స్టార్ వచ్చారు. పల్లెరఘునాధ్ గారు కూడా ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తారు. మీ అందరి సపోర్ట్‌తో ఈ చిత్రం మంచి విజయం సాధించి ఈ మొదటి చిత్రంతోనే మాకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చి మరిన్ని సినిమాలు చేయడానికి మాకు ఎనర్జీని ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ… ఈ చిత్రంలో నేను హీరోయిన్‌గా నటిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దర్శకనిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం నాకు ఒక మంచి అవకాశం. ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగింది. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉంటుంది కోరుకుంటున్నాను అన్నారు.
సుమన్ మాట్లాడుతూ… నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఘటికాచలంగారు నాకు చాలా కాలం నుంచి పరిచయం. ఆయన ఎంతో మంచి రైటర్. ఆయన కథ వినమంటే విన్నాను. ఇది ఒక కమర్షియల్ చిత్రం. కొత్తగా ఓ సైంటిఫిక్ పాయింట్. అదేవిధంగా కాలేజీలో డ్రగ్స్ విషయం పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ కథాంశం ఓ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఇందులో నేను ఓ పోలీస్ కమీషనర్‌గా కనిపిస్తాను. షూటింగ్ మొత్తం అనంతపురంలో జరిగింది. ఈ చిత్రంలో పల్లె రఘునాధ్‌గారు ఇందులో ఓ పాత్రలో నటించడం జరిగింది. ఆయన మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా మాత్రమేగా కాకుండా విద్యారంగంలో కూడా మంచి అవగాహన ఉంది. ఆయనకు సొంతంగా 70 కాలేజీలు ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. హీరో సాయి చరణ్, హీరోయిన్ పల్లవి ఇద్దరూ కూడా చాలా బాగా నటించారు. సీన్స్ అన్నీ ఫాస్ట్‌గా ముందుగా వెళ్ళడానికి కెమెరామ్యాన్ పని తనం బాగా కనిపిస్తుంది. డిజిటల్ టెక్నాలజీ పెరిగాకే సినిమాల చీత్రీకరణ బాగా స్లో అయింది. రీల్ ఉన్నప్పుడు అంతా ఒక లెక్కగా ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగాక మాత్రం లేటవుతుంది. కానీ సురేందర్‌రెడ్డిగారు మాత్రం చాలా త్వరగా చాలా చక్కగా పనిని ముందుకు తీసుకువెళ్ళారు. అలాగే నా ఫ్రెండ్ సత్యప్రకాశ్ కూడా ఒక ట్విస్ట్ ఉన్న పాత్రలో నటించారు. ఒక పోలీస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. చిత్ర యూనిట్ మొత్తం చాలా మంచిగా కలిసికట్టుగా పని చేశారు. ఇక నిర్మాత లక్ష్మీపతిగారికి ఈ సినిమా ఆడి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
సత్యప్రకాశ్ మాట్లాడుతూ… ఎన్నో అర్ధం కాని సినిమాలు చాలా వస్తున్నాయి. ఐక్యూ చిత్రం ఎంతో అద్భుతమైన చిత్రం. దీనికి స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది. ఐక్యూ అంటే ఐక్యూ అన్నట్లు ఉంటుంది ఈ చిత్రం. బ్రహ్మాండమైన టీమ్‌తో ఈ సినిమా చేయడం జరిగింది. ఎంతో ఆడుతూ పాడుతూ చేస్తున్నాము. హీరో ఎంతో అందంగా ఉన్నాడు. నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను సాయి కి చాలా మంచి పేరు వస్తుంది. సుమన్‌గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన షూటింగ్ స్పాట్‌లో ఉన్నారంటే మొత్తం పాజిటివ్ వైబ్స్ కనబడతాయి. ఆయనతోపాటు చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సినిమా మంచి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.
సుమన్, సత్యప్రకాశ్, సూర్య, బెనర్జీ, గీతాసింగ్, జబర్‌దస్త్ సత్తిపండు, షేకింగ్ శేష్, డా. హరిప్రసాద్, రాయల్ మురళి, హీరో సాయిచరణ్, హీరోయిన్ పల్లవి ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతంః పోలూర్ ఘటికాచలం, రచన సహకారంః దివాకర్ యడ్ల, కెమెరాః టి. సురేందర్‌రెడ్డి, పాటలుః వరికుప్పల యాదగిరి, పి. నాగేంద్రప్రసాద్, , ప్రొడక్షన్ మ్యానేజర్ ఃశీలం శ్రీనివాసరావు, ఎడిటర్.. శివ శర్వాణి సమర్పణ : కాయగూరల రాజేశ్వరి , నిర్మాతః కాయగూరల లక్ష్మీపతి, బ్యానర్ : శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్.కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : శ్రీనివాస్ జి. ఎల్. బి