Reading Time: < 1 min

IT Rides On Dill Raju House
దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్

ప్రముఖ తెలుగు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ ఆధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంతో టాలీవుడ్ అంతా షాక్ లో ఉంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో ఉన్న దిల్ రాజు, దిల్ రాజు సోదరుడు శిరీష్, దిల్ రాజు కూతురు హన్షిత ఇళ్లతో పాటు దిల్ రాజు రెండు ఆఫీసుల్లో ఒకే సారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒకే సారి 8 చోట్ల 55 మంది అధికారులు ఈ రైడ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించిన విషయం తెలిసిందే. ఆ తరువాత పుష్ప చిత్ర సంఘటనలో ప్రభుత్వంతో మంథనాలు జరిపించడంలో దిల్ రాజు ప్రముఖ పాత్ర వహించారు. బాధిత కుటుంబానికి కూడా ఫిల్మ్ కార్పొరేషన్ అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆ తరువాత వరుసగా సంక్రాంతి బరిలో రెండు సినిమాలతో ముందుకు వచ్చారు. రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్, వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం. దీంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు. అయితే ఇదే సమయంలో పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లోనూ, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వీరితో పాటు సింగర్ సునీత భర్త రాముకి చెందిన మ్యాంగో కంపెనీలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.