Reading Time: < 1 min

IT Rides on Director Sukumar House
దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్

టాలీవుడ్ లో ఐటీ రైడ్స్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ప్రముఖ నిర్మాణ సంస్థల ఆఫీసులు, నిర్మాతల ఇండ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తాజాగా డైరెక్టర్ సుకుమార్‌ మీద కూడా రెయిడ్ నిర్వహిస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు పొందిన సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలస్తుంది.

సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన పుష్ప 2 ది రూల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇది బాక్సాఫీస్ వద్ద 1850 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ కారణంగానే ఐటీ రైడ్స్ జరిగినట్లు తెలస్తుంది. మైత్రీ మూవీస్ ఆఫీస్, నిర్మాత నవీన్ యెర్నేని, సీఈఓ చెర్రీ ఇళ్లలో నిన్న ఉదయం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాత సుకుమార్ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు దిల్ రాజు, మ్యాంగో మీడియా, అభిషేక్ అగర్వాల్ సహా పరిశ్రమలోని పలువురు అగ్ర నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.