Reading Time: 2 mins

Jabilamma Neeku Antha Kopama Director and Producer Dhanush
జాబిలమ్మ నీకు అంత కోపమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ధనుష్

తమిళ స్టార్ హీరో ధనుష్ మల్టీట్యాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. నటుడిగా రాణిస్తూనే డైరెక్టర్ గా, నిర్మాతగా, పాటల రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా అలరిస్తారు. తాజాగా ఆయన దర్శకత్వంలో వస్తున్న జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా ఫిబ్రవరి 21 న విడుదలకు సిద్దంగా ఉంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఏంటో మీకు తెలుసా.. అయితే చదివేయండి.

పా పండి (2017)
ధనుష్ కు డైరెక్టర్ గా మొదటి సినిమా పా పండి(Pa Paandi ). ఈ సిినిమాకు ఆయనే నిర్మాత. రాజ్ కిరణ్, రేవతి, ప్రసన్న, మడన్న సెబస్టీయన్ లతో పాటు ధనుష్ సైతం ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి పాజిటీవ్ రివ్యూస్ తో పాటు కమర్షియల్ గా మంచి సక్సెస్ అయింది. దాంతో కన్నడలో అంబి నింగ్ వయస్సైతో (Ambi Ning Vayassaytho) గా రీమేక్ చేశారు.

కథ విషయానికి వస్తే పాండి గా రాజ్ కిరణ్ నటించారు. ఆయనోక రిటైర్డ్ స్టంట్ మ్యాన్. సినిమాలకు పనిచేసే వారు. కొడుకు ప్రసన్నతో కలిసి ఉండే వాడు. ఊరికే కూర్చొకుండా బయట వాళ్ల సమస్యల్లో తలదూర్చడం వాటిని ఇంటి వరకు తీసుకురావడంతో కొడుకుకు, తండ్రికి పడేది కాదు. విషయం అర్థం చేసుకున్న పాండి తన పాత బుల్లెట్ బండితో లాంగ్ ట్రిప్ కు బయలు దేరుతాడు. అదే ప్రయాణంలో చాలా మంది వృద్దులు కలుస్తారు. వారితో తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పుతాడు. తన లవ్ స్టోరీలో ఉన్న ఆవిడ అంటే రేవతి గురించి ఒక వ్యక్తికి తెలుసని హైదరాబాద్ తీసుకెళ్లి తనను కలిపిస్తాడు. ఇద్దరు ఒక రెస్టారెంట్ లో కలుసుకొని కబుర్లు చెప్పుకుంటారు. పాండి రేవతికి ప్రపోజ్ కూడా చేస్తాడు. ఒక రోజు లంచ్ కు రావల్సిందిగా రేవతి చెబుతుంది. పాండి తన సంతోషమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. తన తప్పు తెలుసుకున్న కొడుకు రాఘవన్ తండ్రిని వెతుకుతూ.. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకొని రేవతి ఇంటికి వస్తాడు. ఇక ఫైనల్ గా రేవతి ఇంటిలో అందరూ కలుసుకుంటారు. రేవతి, పాండి ఇక మిగిలిన జీవితాన్ని ఇలానే జ్ఞాపకాలతో బతికేద్దామనుకుంటారు. కొడుకు రాఘవతో రేవతికి ఇంటికొచ్చేస్తాడు. ఇది బరువైన భాగోద్వేగాలతో నిండిన కథ.

రాయన్(2024)
ధనుష్ రచించి దర్శకత్వం చేసిన రాయన్ చిత్రం రూ. 160 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. ఇంత గ్రాస్ సాధించిన తమిళ ఏ సర్టిఫికెట్ చిత్రాల్లో రాయన్ మొదటిది. ఈ చిత్రంలో దుశర విజయన్, సందీప్ కిషన్, ఎస్ జే సూర్య, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్, అపర్ణ తదితరులు నటించారు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు.

కథ విషయానికి వస్తే.. ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలుతో చిన్నప్పుడే చెన్నై వచ్చిన రాయన్ ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటాడు. అదే సమయంలో చెన్నైలో ఆ ప్రాంతంలో రెండు గ్యాంగులు దురై, సేతు నడుమ గొడవలు జరుగుతుంటాయి. రాయన్ పెద్ద తమ్ముడు అయిన ముత్తు(సందీప్ కిషన్) తాగుడు బానిస అవుతాడు. అలా అనుకోకుండా ఒక గొడవలో దూరిపోతాడు. ఆ సమయంలో దొరై తమ్ముడిపై సేతు మనుషులు ఒక బారులో ఎటాక్ చేస్తారు. అదే సమయంలో అక్కడే ఉన్న ముత్తు ఆ గొడవలోకి వెళ్లి దురై తమ్ముడిని చంపేస్తాడు. అందరూ సేతునే అతన్ని చంపించాడు అనుకుంటాడు. కానీ నిజం తెలుసుకున్న దురై రాయన్ ను పిలిపించి తన తమ్ముడు ముత్తును అప్పగించమని చెబుతాడు. దాంతో రాయన్ అతను ఇద్దరు తమ్ముళ్లు కలిసి దురై ని చంపేస్తారు.

దురైని చంపింది ఎవరో సైతుకు తెలియదు. తరువాత దానికి కారణం రాయన్ అని తెలుసుకొని అతన్ని ఎలాగైన తన దగ్గర పెంటుకోవాలి అనుకుంటాడు. దానికి రాయన్ ఒప్పుకోడు. దాంతో రాయన్ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతాడు. అదే సమయంలో సేతు మనుషులు రాయన్ చెల్లెలును కిడ్నాప్ చేస్తారు. అందులో ఒకడు తనను రేప్ చేస్తాడు. తన కిడ్నాప్ వెనుక రాయన్ తమ్ముళ్లు ఇద్దరు ఉన్నారని రాయన్ కు తెలుస్తుంది. రాయన్ అతిని చెల్లెలు దుర్గ కొంతకాలం అజ్ఞతంలో ఉంటారు. అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ వీరి గొడవలకు చెక్ పెట్టాలని సేతు చంపమని పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ ఇస్తాడు. ఇక క్లైమాక్స్ లో సేతును అతని ఇద్దరు తమ్ముళ్లను కూడా చంపెస్తాడు రాయన్. డబ్బుకోసం వచ్చిన రాయన్ ను కూడా చంపీ క్రైమ్ లేకుండా చేయాలని పోలీస్ ప్లాన్ చేస్తాడు. కానీ రాయన్ డబ్బుకోసం కాదు తన చెల్లెలుకు జరిగిన అన్యాయానకి ప్రతీకారం తీర్చుకొని ఊరు వదిలి వెళ్లిపోతాడు.

జాబిలమ్మ నీకు అంత కోపమా(2025)
జాలిగా వచ్చి జాలిగా వెళ్లండి అంటూ ట్రైలర్ రిలీజ్ చేసి చాలా సరదాగా సాగిపోయే సినిమా అని చెబుతున్నారు. అలాగే ఫ్రెష్ లవ్ స్టోరీ అనే ఒక పదాన్ని ప్రచారంలో వాడుతున్నారు. ప్రజెంట్, పాస్ట్ లవ్ స్టోరీలను చూపిస్తూ స్క్రీన్ ప్లే బేస్డ్ కాన్సెప్ట్ లా ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు అలరించబోతుందో.

ఇండ్లి కడాయ్(2025)
ధనుష్ రచించి దర్శకత్వం చేయడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న చిత్రం ఇండ్లి కడాయ్. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు అరున్ విజయ్, నిత్య మీనన్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.