Jabilamma Neeku Antha Kopama Movie is Very Special for Us
జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా మాకు ఎంతో ప్రత్యేకం
తమిళ స్టార్ హీరో ధనుష్ రచించి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మూవీ యూనిట్ పాల్గొన్నారు. నటీనటులతో పాటు ప్రొడ్యూసర్ జాన్వీ నారాయణ్ పాల్గొన్నారు.
జాన్వీ నారాయణ్ మాట్లాడుతూ.. జాబిలమ్మ నీకు అంత కోపంగా మంచి సినిమా అందరూ ఆదరించండి అన్నారు. ఫిబ్రవరి 21 ప్రేక్షకుల ముందుకు వస్తుందని, అందరు కొత్త యాక్టర్స్ అని చెప్పారు.
రబియా కతుర్ మాట్లాడుతూ.. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కొత్త వాళ్ళతో ధనుష్ గారు చేసిన ఈ ప్రాజెక్టు లో పనిచేయడం నా అదృష్టం అని చెప్పారు.
వెంకటేష్ మీనన్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచింది, అందరు ఎంజాయ్ చేయండి. చాలా సరదాగా ఉంటుందని చెప్పారు.
రమ్య రంగానాథన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ఆశించారు.
పవిష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ వెంకీ అట్లూరి, ధనుష్ ఇద్దరికి థాంక్స్ చెప్పాలి అన్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన సర్ సినిమా ద్వారా పరిచయం అయినట్లు చెప్పారు.
అనిక మాట్లాడుతూ.. ఫిబ్రవరి21 న వస్తున్న మా సినిమాను అందరు చూసి ఆదరించాలని కోరారు.
ప్ర: సినిమా ద్వారా ఎం నేర్చుకున్నారు
పవిష్: ఓపికగా ఉండడం?
ప్ర: బాయ్స్ సినిమాలా ఉంది మీకు ఎలా అనిపించింది
జాన్వీ నరాయన్: సినిమా చాలా బాగుంది. మీకు నచ్చుతుంది
ప్ర: అనిక క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
అనిక: చాలా సింపుల్ గా ఉంటుంది. పక్కింటి అమ్మాయిలా ఉంటుంది.
ప్ర: ఇలాంటి లవ్ స్టొరీ ఫిబ్రవరి14 న వస్తుంటాయి కదా ఇది ఫిబ్రవరి 21 ఎందుకు?
జాన్వీ నారాయణ్: అలా ఎం లేదు. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు.
ప్ర: ఈ సినిమాతో పాటు తెలుగులో 3 సినిమాలు రిలీస్ అవుతున్నాయి కదా ప్రేక్షకులు ఈ సినిమానే ఎందుకు చూడాలి?
జాన్వీ నారాయణ్: ఏ సినిమా బాగుంటే, ఏ ట్రైలర్ నచ్చితే దానికి వెళ్తారు.
పియా: ధనుష్ స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
వెంకటేష్ : ధనుష్ గారికి 3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. డ్రీమ్ కమ్ ట్రూ లా ఉంది.
ప్ర: సినిమాలో ఏదైనా మేస్సేజ్ ఉంటుందా?
పవిష్ : ఎలాంటి మెసేజ్ లేదు. జాలిగా వచ్చి సినిమా చూసి జాలుగా వెళ్ళండి.